నారా లోకేష్ రావాలి, నాయకత్వ లక్షణాలున్నాయి: ఆకాశానికెత్తిన కెఈ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేష్‌ను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆకాశానికెత్తారు. లోకేష్‌లో మంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటున్నారని ఆయన అన్నారు. లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నానన్నారు.
కార్యకర్తల కోసం లోకేష్ ఎంతగానో కష్టపడుతున్నారని కేఈ అన్నారు. లోకేష్ ఇటీవల చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని చెప్పారు. తాము కూడా ఓ నాయకుడిని తయారు చేసుకోవాలని అనుకుంటున్నామని, లోకేష్‌లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయన అన్నారు.

నారా లోకేష్‌పై ప్రజలకు విశ్వాసం ఉందని, సంక్షేమ యాత్ర విజయవంతమైందని, పార్టీ సభ్యత్వాన్ని 50 లక్షలకు పెంచారని ఆయన అన్నారు.
త్వరలో రెవెన్యూ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని కేఈ అన్నారు. రెవెన్యూ శాఖలో 88 శాతం ఆధార్ సీడింగ్ జరిగిందని ఆయన చెప్పారు. ఎమ్మార్వోలను పక్క మండలాలకు బదిలీ చేసే ఆలోచన ఉన్నట్లు కెఈ చెప్పారు. గ్రామకంఠాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications