తెలిస్తే నారాయణరెడ్డిని రక్షించేవాడ్ని: కేఈ, 'చంద్రబాబు రిజైన్ చేయాలి'
కర్నూలు: వైసిపి పత్తికొండ ఇంచార్జ్ నారాయణ రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు. ఆయనకు ఎస్పీ గన్‌మెన్లను ఎందుకు ఉపయోగించారో తనకు తెలియదన్నారు.
నారాయణ రెడ్డి హత్యలో తన అనుచరుల ప్రమేయం లేదని చెప్పారు. తన అనుచరుల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలితే వారికి శిక్షపడేలా చేస్తానని కేఈ చెప్పారు.

రక్షించేవాడిని
నారాయణ రెడ్డికి ప్రాణహానీ ఉందని తెలిస్తే తాను రక్షించేవాడిని అని కేఈ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగా తనపై నిందలు వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేఈ హస్తం ఉంది, బాబు రాజీనామా చేయాలి.. రోజా
నారాయణ రెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హస్తం ఉందని వైసిపి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ సాంబశివ రావు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు సీఎంగా కొనసాగే హక్కు లేదన్నారు. పార్టీ నేతల తప్పులు కప్పిపుచ్చేందుకు చంద్రబాబు జీవో 130 తీసుకు వచ్చారన్నారు. తాను నిజాలు మాట్లాడితే పోలీసు సంఘం విమర్శలు చేసిందని మండిపడ్డారు.

ప్లాన్ ప్రకారం హత్య.. రోజా
నారాయణ రెడ్డిది ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అన్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
అధికార పార్టీ నేతల ఆకృత్యాలపై పోలీసు సంంఘాలు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఏపీలో శాంతిభద్రతలను కాపాడాలని రోజా డిమాండ్ చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేల కుట్ర
ఇది ప్రభుత్వ హత్య అని అనంత వెంకట్రామి రెడ్డి ఆరోపించారు. నారాయణ రెడ్డి ఎదుగుదలను అధికార పార్టీ ఓర్వలేక పోయిందన్నారు. వైసిపికి, నారాయణ రెడ్డికి ప్రజాధరణ వస్తుండటంతో హత్య చోటు చేసుకుందన్నారు. దీని వెనుక మంత్రులు, ఎమ్మెల్యేల కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు.

ఇంటెలిజెన్స్ వైఫల్యం
నారాయణ రెడ్డి హత్యపై మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తనకు ప్రాణహానీ ఉందని ఆయన చెప్పినా పట్టించుకోలేదన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications