నెల్లూరు లో గెలుపెవరిది - ఆ పార్టీకి డేంజర్ బెల్స్..!!
ఏపీలో ఎన్నికల ఫలితాల పై గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీలో ఈ సారి హోరా హోరీ పోరు సాగింది .అందులో నెల్లూరు ఎంపీ స్థానంలో ఫలితం పైన భిన్న అంచనాలు ఉన్నాయి. అక్కడ గెలుపు రెండు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. చివరి నిమిషం వరకు హోరా హోరీగా పోరాటం చేసారు. గెలుపు పైన రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. కానీ, ఎన్నికల సరళి మాత్రం గెలుపు ఎవరిదో స్పష్టం చేస్తోంది.
హోరా హోరీ పోరు
నెల్లూరులో ఎన్నికల ముందు అనూహ్య సమీకరణాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా ప్రచారంలోకి వచ్చిన వేమిరెడ్డి అనూహ్యంగా టీడీపీ ఎంపీ అభ్యర్ది అయ్యారు. దీంతో..సీఎం జగన్ అక్కడి నుంచి సాయిరెడ్డిని బరిలోకి దించారు. ఆర్థికంగా బలవంతుడు అయిన వేమిరెడ్డి పైన వైసీపీలో కీలకంగా ఉన్న సాయిరెడ్డి పోటీ చేయటంతో నెల్లూరు పోటీ ఒక్క సారిగా వేడెక్కింది. ఇద్దరు నేతలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల్లో పోటీ పడ్డారు. మైండ్ గేమ్, ఆర్దిక వనరుల సమీకరణ, ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు, నేతలను ఆకట్టుకోవటం వంటి ప్రయత్నాలు చేసారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా పార్టీకి కంచుకోటగా నిలిచింది.

మారిన లెక్కలు
ఈ సారి వేమిరెడ్డి పోటీలో దిగటం..ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో పోరు ఆసక్తిగా మారింది. వేమిరెడ్డి తన శక్తి వంచన లేకుండా పోరాటం చేసారు. అన్ని విధాలుగానే గట్టి పోటీ ఇచ్చారు. సాయిరెడ్డి గెలుపు ఇక్కడ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. వైసీపీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు నెల్లూరు ఎంపీ స్థానం వైసీపీ ఓడిపోలేదు. దీంతో..జగన్ సైతం ఏరి కోరి సాయిరెడ్డిని అక్కడ అభ్యర్దిగా ఖరారు చేసారు. నెల్లూరులో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక టీంను ఏర్పాటు చేసారు. ప్రతీ రోజు నెల్లూరులో ప్రచారం..చివరకు పోలింగ్ తరువాత సరళి గురించి ఆరా తీసారు. నెల్లూరు పార్లమెంట్ లో 79.05 శాతం పోలింగ్ నమోదైంది.

గెలుపు పై క్లారిటీ
నెల్లూరులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒక దశలో రెండు పార్టీల మధ్య హోరా హోరీ పోరు సాగింది. నెల్లూర సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ సమయం సమీపించే వేళ పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారింది. కానీ, పోల్ మేనేజ్మెంట్ లో చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాలు ఒక పార్టీకి పూర్తిగా పై చేయి సాధించటానికి కారణమయ్యాయి. తమకు అండగా నిలుస్తాయని భావించిన వర్గాలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవటంలో ఆ పార్టీ సక్సెస్ అయింది. 2019లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఆ తరహా ఫలితాలే ఆశిస్తోంది. కానీ, టీడీపీ సైతం తాము పూర్తిగా పై చేయి సాధిస్తామని చెబుతోంది. కానీ, ఫలితం మాత్రం ఊహించని విధంగా ఉండనుందని పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. దీంతో..పోలింగ్ లెక్కలు తేలిన తరువాత ఒక ప్రధాని అభ్యర్ది క్యాంపులో టెన్షన్ మొదలైంది. తుది ఫలితం పై ఉత్కంఠ పెరుగుతోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications