కీర్తిసురేశ్ పెళ్లిపై ఆమె తండ్రి క్లారిటీ

కీర్తి సురేశ్ పెళ్లిపై కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె తన స్నేహితుడితో దిగిన ఫొటో వైరల్‌గా మారింది. కీర్తికి కాబోయే వరుడు అతడేనంటూ పలు వెబ్‌సైట్లలో వార్తాకథనాలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించింది. అతడు తన స్నేహితుడని, పెళ్లంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అయినా ఆమె వివాహం గురించి వార్తలు ఆగకపోవడంతో కీర్తి సురేశ్‌ తండ్రి సురేష్‌ కుమార్‌ ఒక వీడియోను విడుదల చేశారు.

''ఇటీవల కీర్తి సురేశ్‌ (keerthy suresh) తన స్నేహితుడితో దిగిన ఫొటోపై పలురకాల వార్తలు వస్తున్నాయని, ఆ అబ్బాయి కీర్తికి మాత్రమే కాదు.. తమకు కూడా తెలుసన్నారు. అతని పేరు ఫర్హాన్‌ (Farhan)అని, అతని పుట్టినరోజు సందర్భంగా కీర్తి ఒక ఫొటో షేర్‌ చేసి అతడికి శుభాకాంక్షలు తెలిపింది. దీనిపై మొదట ఒక తమిళ మీడియా వార్తలు రాసిందని, తర్వాత కొన్ని గంటల్లోనే అన్నీ ఛానల్స్‌లో వార్తలు వచ్చాయని సురేశ్ చెప్పారు. కీర్తికి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా తామే చెబుతామన్నారు. సున్నితమైన విషయాలపై రూమర్స్ సృష్టించవద్దని, దీనివల్ల కుటుంబంలో మనశ్శాంతి కరవవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

keerthy suresh

ఈ ఫొటోపై వస్తున్న వార్తలనుద్దేశించి కీర్తి సురేశ్‌ ట్వీట్‌ చేసింది. అతను తన ఆత్మీయ స్నేహితుడని, ఈ వార్తల్లోకి లాగారని, నిజమైన మిస్టరీ మ్యాన్ ను సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అందరికీ పరిచయం చేస్తానని పేర్కొంది. అప్పటివరకు అందరూ చిల్ గా ఉండాలని, ఒక్కోసారి సరైన వార్తలను కూడా ప్రచారం చేయరన్నారు. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు రఘు తాత సినిమాలో కూడా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+