కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
విజయవాడ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. విజయవాడ ఎంపీ స్థానం కోసం కేశినేని బ్రదర్స్ పోటీలో ఉన్నారు. ఎవరు గెలుస్తారనే ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ఈ సమయంలోనే మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. కేశినేని కుటుంబం నుంచి మరొకరికి కాంగ్రెస్ ఎంపీ సీటు ఇచ్చింది. దీంతో..ఒకే కుటుంబం నుంచి ముగ్గురు మూడు పార్టీల నుంచి తల పడుతున్నారు. దీంతో..గెలుపు దక్కేదెవరికి అనే అంశం పై కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
విజయవాడ ఎంపీ ఫైట్
విజయవాడ రాజకీయం కొత్త ములుపు తీసుకుంటోంది. కేశినేని బ్రదర్స్ కేంద్రంగా విజయవాడ రాజకీయం కొంత కాలంగా కొనసాగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నాని వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నానితో విభేదించిన ఆయన సోదరుడు చిన్ని విజయవాడ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉన్నారు. ఈ ఇద్దరి పోటీ..గెలుపు అవకాశాల పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్ది ఎంపికతో ఈ బ్రదర్స్ ఇద్దరి పొలిటికల్ వార్ లో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది.

కాంగ్రెస్ నుంచి భార్గవ్
కేశినేని కుటుంబం నుంచి కాంగ్రెస్ తమ అభ్యర్ది విషయంలో షర్మిల కీలకంగా వ్యవహరించారు. వ్యూహాత్మకంగా తమ అబ్యర్ది ని బరిలోకి దించారు. మూడు పార్టీల నుంచి ఒకే కుటుంబ సభ్యులు విజయవాడ బరిలో నిలిచారు.కేశినేని నాని, చిన్న సోదరి వల్లూరు కస్తూరి. ఆమె మనవడు వల్లూరు భార్గవ్. ఇప్పుడు కాంగ్రెస్ ఏరి కోరి భార్గవ్ ను తమ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్దిగా ఖరారు చేసింది. తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేసారు. దీంతో..ఒకే కుటుంబం నుంచి ముగ్గురు విజయవాడ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కేశినేని నాని టీడీపీకి దూరం అవ్వటానికి ముందు నుంచే చిన్ని పార్టీలో యాక్టివ్ అయ్యారు. లోకేష్ యువగళం యాత్ర సమయంలో చిన్ని కీలకంగా వ్యవహరించారు.
ఎంపీగా గెలుపెవరిది
ఆ తరువాత చిన్నికి ఎంపీ సీట పైన పార్టీ హామీ ఇచ్చింది. ఆ సమయంలోనే నాని టీడీపీకి దూరమయ్యారు. వైసీపీలో చేరి ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. అక్కడ నాని -చిన్ని మధ్య ఎవరు గెలుస్తారనే దాని పైన భిన్నమైన అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో అదే కుటుంబానికి చెందిన భార్గవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే నాని - చిన్ని ప్రచారంలో పోటా పోటీగా ముందుకు వెళ్తున్నారు. హోరా హోరీ పోరు ఖాయమని అంచనాలు వ్యక్తం అవుతున్నవేళ తుది విజేత ఎవరనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications