పార్టీ మార్పు, ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన కేశినేని నాని..!!
టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇప్పుడు టీడీపీ రాజకీయల్లో సంచలనంగా మారారు. టీడీపీకి...ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తరువాతి అడుగుల పైన నాని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో రాజీనామా ప్రకటన తరువాత వైసీపీ నేతలతో కలిసి నాని కార్యక్రమాల్లో పాల్గొనటం కీలక పరిణామంగా మారుతోంది. తనతో పాటుగా తన అనుచర వర్గం సైతం టీడీపీ వీడుతుందనే సంకేతాలు ఇచ్చారు. తన అనుచరులతో సమావేశం తరువాత నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.
ఎంపీ కేశినేని నాని టీడీపీ వీడటం ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటమూ ఖాయమని చెబుతున్నారు. టీడీపీ వీడుతున్నట్లు ప్రకటించిన కేశినేని ఏ పార్టీలో చేరేదీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నాలుగు రోడ్ల మధ్యలో ఉన్నప్పుడు ఏ రోడ్డులో నుంచి వెళ్లాలనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తన అనుచర వర్గంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానన్నారు. తానొక్కడినే కాదని..అనుచర వర్గాన్ని క్యారీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. టీడీపీ నుంచి సీటు ఈ సారి దక్కదనే సమాచారం కేశినేని ముందు నుంచే అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా గతంలోనే తాను స్వతంత్రంగా అయినా పోటీకి సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. వచ్చే వారం కేశినేని నాని తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.

పొగబెట్టారు.. పొమ్మన్నారు..వెళుతున్నాను..!!#KesineniNani #TDP #Chandrababu #Vijayawada #Oneindiatelugu pic.twitter.com/ifC8Mx8aQF
— oneindiatelugu (@oneindiatelugu) January 6, 2024
నా వాళ్ల నిర్ణయమే నాకు శిరోధార్యం..!!#KesineniNani #TDP #Chandrababu #Vijayawada #Oneindiatelugu pic.twitter.com/6uujBYoVxM
— oneindiatelugu (@oneindiatelugu) January 6, 2024












Click it and Unblock the Notifications