విసిగి వేసారిన కేశినేని నాని: ఆగని రాజీనామాల పర్వం: ఆయన వెంటే..: టీడీపీని ఖాళీ చేయించే పనిలో
Kesineni Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడట్లేదు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. పార్టీని వీడి బయటికి వెళ్లిపోయేలా చేస్తోంది.
విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని వ్యవహారమే దీనికి నిదర్శనం. కుటుంబాలను చీలుస్తారంటూ ఇదివరకు కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. కేశినేని ఉదంతంలో వాస్తవ రూపాన్ని దాల్చాయి. నానికి వ్యతిరేకంగా ఆయన సొంత తమ్ముడు చిన్నిని ప్రోత్సహించారు.

దీని ఫలితంగా- కేశినేని నాని తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తెలుగుదేశానికీ గుడ్‌బై చెప్పాల్సిన పరిస్థితిని కలిగించింది. ఇది ఆయనతో ఆగేలా కనిపించట్లేదు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ నేతలను కూడా ఆయన తన వెంట పార్టీ నుంచి బయటికి తీసుకెళ్లొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇందులో భాగంగా- విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత పార్టీకి రాజీనామా చేయనున్నారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికీ గుడ్‌బై చెప్పనున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు కేశినేని నాని తెలిపారు.
ఈ ఉదయం 10:30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాని వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, దాన్ని ఆమోదింప చేయించుకుంటారని నాని వెల్లడించారు. ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తారని వివరించారు. తన కూతురితోనూ ఆయన రాజీనామా చేయిస్తోన్నారంటే చంద్రబాబు వైఖరికి ఆయన ఎంతగా విసిగి వేసారిపోయారో అర్థం చేసుకోవచ్చని వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తోన్నారు.












Click it and Unblock the Notifications