నిర్ణయం మార్చుకున్న కేశినేని నాని, ఇక..!?
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవటం పైన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి పాలన పైన ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని వైసీపీ భావిస్తోంది. కూటమి పార్టీల్లోకి చేరికలు కనిపించటం లేదు. మాజీ సీఎం జగన్ జిల్లాల పర్య టనలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో టీడీపీలో ఎంపీగా పని చేసి.. వైసీపీ చేరి 2024 లో ఓడి.. ఆ తరువాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని నాని తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
నాని అడుగులు
టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పని చేసిన కేశినేని నాని తిరిగి ఈ మధ్య కాలంలో యాక్టివ్ అవుతున్నారు. 2024 ఎన్నికల వేళ తన సోదరుడుతో విభేదాలు.. టీడీపీలో చిన్నికి ప్రాధాన్యత... సీటు ఆయనకే ఇస్తున్నారనే స్పష్టతతో కేశినేని నాని పార్టీ వీడారు. జగన్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. నాని పైన సోదరుడు చిన్ని టీడీపీ అభ్యర్దిగా విజయం సాధించారు. ఆ తరువాత నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నారు. కాగా, కొంత కాలంగా చిన్ని లక్ష్యంగా నాని వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఉర్సా వివాదం, రాజ్ కసిరెడ్డి తో చిన్ని సంబంధాల పైన సీఎం చంద్రబాబుకు నాని చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి.

చిన్ని టార్గెట్ గా
కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నా... రాజకీయంగా మాత్రం తన సోదరుడు చిన్నినే టార్గెట్ చేస్తున్నారు. దీంతో, చిన్నితో పాటుగా విజయవాడ టీడీపీ నేతలు సైతం నాని పైన విరుచుకుపడుతున్నారు. జగన్ కోవర్టుగానే నాని టీడీపీలో కొనసాగారని ఆరోపణ లు చేస్తున్నారు. అయితే, నాని ఈ సారి చిన్ని పైన ఫిర్యాదులు.. నియోజకవర్గంలోని ముఖ్యుల తో సమావేశాలతో నాని ఆలోచన మారిందనే చర్చ విజయవాడలో మొదలైంది. విజయవాడతో తనకు ఉన్న అనుబంధం గురించి పలు సందర్భాల్లో నాని చెప్పుకొచ్చారు. ఎంపీగా తాను చేసిన కార్యక్ర మాలను వివరిస్తున్నారు. అయితే, వైసీపీ నుంచి బయటకు వచ్చిన నాని కూటమి పార్టీల్లోకి వెళ్లే ప్రయత్నం చేసారనే ప్రచారమూ ఉంది.
ఏ పార్టీలోకి
కేశినేని నానికి బీజేపీ అధినాయకత్వంలోని ముఖ్యులతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే, బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉండటంతో...నాని రీ ఎంట్రీకి టీడీపీ అడ్డుపడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ చిన్నికే టీడీపీ విజయవాడ సీటు ఇవ్వటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. దీంతో, నాని తిరిగి వైసీపీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. మంచి సమయం చూసు కుని ఆయన తిరిగి వైసీపీలో యాక్టివ్ అవుతారని బెజవాడలో టాక్. తనను నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేయాలంటే రాజకీయాలలో కొనసాగాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
ఇప్పటి నుంచే తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయితే, నానికి వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బలం పెంచుకుటారనే వాదన వినిపిస్తోంది. అయితే, నాని తిరిగి వైపీపీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారా .. తిరిగి రాజకీయంగా ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది ఇప్పుడ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications