ఏపీ 10వ తరగతి పరీక్షా విధానంలో కీలక మార్పులు: ఇక ఆరు పరీక్షలే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్ష విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఏడు పేపర్లకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ కు అనుగుణంగా ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లు మాత్రమే ఉండేలా ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ను కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కొత్త విధానం తీసుకొచ్చినట్లు విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏడాది పొడవునా వివిధ పరీక్షలు నిర్వహిస్తుండటంతో 11 పరీక్షలు అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications