మద్యంపై ఏపీ మండలిలో హాట్ డిబేట్
రాష్ట్రంలో మద్యం కుంభకోణం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలు అరెస్టులు సంభవించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన విచారణను ఎదుర్కొంటోన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెరుకూరి వెంకటేశ్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్‌కృష్ణ పోలీసుల కస్టడీలో ఉన్నారు.
ఈ కేసు.. తాజాగా శాసన మండలి సమావేశాల్లో చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. బెల్ట్ షాపులు, మద్యం పాలసీ, లిక్కర్ కుంభకోణం, రేట్లు, అమ్మకాలు, రవాణా వంటి అంశాలపై ఆయన బదులిచ్చారు.

గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం చోటు చేసుకుందని కొల్లు రవీంద్ర అన్నారు. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. మద్యం విషయంలో అంతా మంచి జరిగిందని వైఎస్సార్సీపీ చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన ఎదురుదాడికి దిగారు. మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోందని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
మద్యం దుకాణదారులు తప్పుచేస్తే వారిపై భారీగా జరిమానా విధించేలా పాలసీని రూపొందించి అమలు చేస్తోన్నామని కొల్లు రవీంద్ర అన్నారు. రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. నాసిరకం మద్యం విక్రయించినా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సరఫరా పర్యవేక్షణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశామని, అత్యంత పారదర్శకంగా లిక్కర్ పాలసీని అమలుచేస్తున్నామని కొల్లు రవీంద్ర చెప్పారు.
తమ ప్రభుత్వం అమలుచేసే మద్యం పాలసీని పక్క రాష్ట్రాలు సైతం అధ్యయనం చేయడానికి ముందుకొస్తోన్నాయని ఆయన పేర్కొన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం ఎప్పుడూ చూడట్లేదని, దీని నియంత్రణకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. నాసిరకం మద్యం అమ్మినవారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో మద్యం వల్ల మరణాలు నమోదు కాలేదని ఓ ప్రశ్నకు కొల్లు రవీంద్ర బదలిచ్చారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications