'బీజేపీలోకి బెజవాడ 'కీ'లక నేత', వైసీపీ ఎమ్మెల్యే..?

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో ఇతర పార్టీలకు చెందిన చాలామంది మాజీ ప్రతినిధులు, ఎందరో ప్రముఖులు బీజేపీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆదివారం అన్నారు. ఎస్టీబీఎల్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, ఎస్వీఎస్ సేవా సమితి వ్యవస్థాపకులు వీరభద్ర రావు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కంభంపాటి మాట్లాడారు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కణితి విశ్వనాథం త్వరలో బీజేపీలో చేరుతారని ప్రకటించారు. విజయవాడలో కూడా ఒక ప్రముఖుడు పార్టీలో చేరుతారని, అక్కడ భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తామని అన్నారు.

కేంద్రమ మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు మాట్లాడుతూ... కుమారుడిని ప్రధానమంత్రి చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఏఐసిసి ఆధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్రాన్ని నిలువునా ముక్కలు చేశారన్నారు. మరో కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీలో మంచి వ్యక్తులకు స్థానం, తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.

Key leaders to join BJP: Hari Babu

విశాఖలో వీసీపీ నుండి వలసలు...!

విశాఖపట్నం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అస్థిరత ఏర్పడింది. ఎన్నికలకు ముందు నుండే ఆ పార్టీ నాయకులు ఒక్కరొక్కరు బయటకు వస్తున్నారు. వీరిలో చాలామంది సీనియర్ నేతలే కావడం గమనార్హం. తాజాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించడంతో ఆ జిల్లాల్లో సీనియర్ నాయకులు దాదాపు దూరమైనట్లుగా చెబుతున్నారు.

జగన్‌కు రాజకీయంగా రాష్ట్రంలోను, ఢిల్లీలోని అండగండగా నిలిచిన మాజీ ఎంపీ సబ్బం హరిని ఎన్నికల ముందే ఆ పార్టీ దూరం చేసుకుంది. సబ్బంకు వైసీపీలో సభ్యత్వం లేనప్పటికీ ఆయన చాలాకాలం జగన్‌కు మద్దతుగా ఉన్నారు. అనంతరం ఆయనకు తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వైసీపీ అగ్రనాయకత్వం ప్రకటించడంతో దూరమయ్యారు.

ఎన్నికల తర్వాత కూడా వైసీపీని వీడుతున్నారు. టీడీపీ నుండి వైసీపీలో చేరిన సీనియర్ నేత దాడి వీరభద్ర రావు జగన్ వ్యవహార శైలి పైన నిప్పులు చెరుగుతూ కొద్ది కాలంలోనే బయటకు వచ్చేశారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా వైసీపీలో గౌరవం లేదని దూరమయ్యారు.

ప్రస్తుతం విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీని వీడిన వారిలో కొందరు ముఖ్యనేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. కొణతాల రామకృష్ణ, ఆయన వర్గీయులు... బీజేపీ మధ్య ఇప్పటికే సంప్రదింపులు జరిగాయన్న ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+