కామాంథుడు అంటే వీడే...మహిళా పేషెంట్ పైనే లైంగిక దాడి!
విశాఖపట్నం: కామంతో కళ్లు మూసుకుపోవడం అంటే ఏమిటో నిరూపించాడో విశాఖ యువకుడు...అత్యవసర వైద్యం కోసం అపస్మారక స్థితిలో ఆస్పత్రికి వచ్చిన మహిళా రోగిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు అరుపులతో అక్కడి నుంచి పరారయ్యాడు. విశాఖపట్టణం కెజిహెచ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించింది.
విశాఖ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గాజువాక సమీపంలోని వికాస్ నగర్‌కు చెందిన 43 ఏళ్ల మహిళకు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆమె చిన్నకుమారుడు క్యాబ్‌లో సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి 1.30 గంటలకు కేజీహెచ్‌కు తరలించమని...ఆమెకు తలలో నరాల సమస్య తలెత్తి ఉండొచ్చని, ఆమెకు బ్రెయిన్ స్కానింగ్ చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో పేషెంట్ ను ఆమె కుమారుడు కేజీహెచ్‌కు తీసుకువచ్చాడు.

అనంతరం ఆస్పత్రి ఆవరణలోనే పీపీపీ విధానంలో నడుస్తున్న మెడాల్ డయాగ్నిస్టిక్ సెంటర్‌కు చెందిన స్ట్రెచర్‌బాయ్ మాడుగుల కిరణ్‌కుమార్ (19) మహిళా పేషెంట్ ను వీల్‌చైర్‌లో స్కానింగ్‌కు తీసుకువెళ్లాడు. ఆమెతోపాటు కుమారుడు కూడా వెళ్లినా స్కానింగ్ సమయంలో బయటే వుండిపోయాడు. స్కానింగ్ అనంతరం స్ట్రెచర్‌బాయ్ కిరణ్‌కుమార్ పేషెంట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయంతో గట్టిగా కేకలు వేయడంతో కిరణ్‌కుమార్ బయటకు పారిపోయాడు. దీంతో కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన రోగి భర్త అనంతరం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications