ఖైదీ నెం.150 ఫంక్షన్ త్వరగా ముగించాలని చెప్పారా?, స్వల్ప తొక్కిసలాట
ఖైదీ నెంబర్ 150 సినిమా ఫ్రీలాంచ్ వేడుక శనివారం రాత్రి గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
గుంటూరు: ఖైదీ నెంబర్ 150 సినిమా ఫ్రీలాంచ్ వేడుక శనివారం రాత్రి గుంటూరు సమీపంలోని హాయ్‌ల్యాండ్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా ఫ్రీలాంచ్ వేడుకను త్వరగా ముగించాలని స్థానిక పోలీసు అధికారి చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఖైదీ నెంబర్ 150 చిత్ర ఫ్రీలాంచ్ వేడుకను వీలైనంత త్వరగా ముగించాలని గుంటూరు రేంజ్ ఐజీ సినిమాకు సంబంధించిన వర్గాలను ఆదేశించారని తెలుస్తోందని అంటున్నారు.
హాయ్‌ల్యాండులో ఇప్పటికే పరిమితికి మించి జనం చేరుకున్నారని, తిరిగి వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉన్నందున వెంటనే ఫంక్షన్ ముగించాలని ఐజీ ఆదేశించారని తెలుస్తోందట. ఈ విషయమై అల్లు అరవిందుతో చర్చించారట కూడా.
తొక్కిసలాట
ఖైదీ నెంబర్ 150 ఫ్రీ లాంచ్ వేడుకలో ఏర్పాటు చేసిన బారికేడ్లు విరిగిపోవడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. మరోవైపు అభిమానులను నియంత్రించడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. దాదాపు పదిహేడు మంది అభిమానులు గాయపడ్డారని తెలుస్తోంది.
ఈ ఘటనలో చెంచయ్య అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు బౌన్సర్లకు గాయాలు అయ్యాయి. ఓ అభిమానికి ఇనుపచువ్వు గుచ్చుకుంది. బౌన్సర్లకు, అభిమానులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఖైదీ నెంబర్ 150
కాగా, చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ఫ్రీలాంచ్ వేడుక గుంటూరు జిల్లాలోని హాయ్ ల్యాండ్సులో అంగరంగ వైభవంగా జరిగింది.

పవన్ కళ్యాణ్ రాకపోవడం చర్చ
చిరంజీవి హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150. కాజల్ కథానాయిక. రామ్ చరణ్ తేజ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రాకపోవడం చర్చకు దారి తీసింది. అయితే ఆయన ట్వీట్టర్ ద్వారా తన స్పందన తెలిపారు.

ఉత్సాహం
ఈలలు.. చప్పట్లు విని చాలా సంవత్సరాలు అయిందని, వీటికి ఎంత శక్తి ఉన్నది అనుభవపూర్వకంగా తెలిసిన వాడినని, మీ నుంచి మరింత ఉత్సాహం కావాలని, దాని కోసం చాలా సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడు మీ ముందుకు వచ్చానని చిరంజీవి అన్నారు.

చిరంజీవి
ఇక్కడ ఉన్న అభిమానులను చూస్తుంటే విజయవాడ కృష్ణానది పక్కన ఉన్నానా? విశాఖ సముద్రతీరం పక్కన ఉన్నానా అనిపిస్తోందన్నారు. ఈ సినిమాలో ఖైదీ డ్రస్‌తో ఉన్న నా ఫస్ట్‌లుక్ వచ్చినప్పుడు జేబుపై ఉన్న 150 నంబర్ చూసి దాసరి తనకు ఫోన్ చేశారని, సినిమాకు ఖైదీ నంబర్ 150 పెట్టుకోవాలని సూచించారని చెప్పారు.
-
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications