ఖైరతాబాద్ గణపతి లడ్డు ప్రసాదం పంపిణీ (పిక్చర్స్)
హైదరాబాద్: ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతి చేతిలో 11 రోజులు నైవేద్యంగా ఉన్న భారీ లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం గురువారు ఉదయం ప్రారంభమైంది. గురువారం ఉదయం 11:45 గంటలకు లడ్డూ ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ బుధవారంనాడు తెలిపారు.

బుధవారం అర్ధరాత్రి తర్వాత లడ్డూను తెరిచి పంపిణికి ప్రణాళికలు సిద్ధం చేశారు. లడ్డ్డూను నైవేద్యంగా సమర్పించిన సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబుకు కొంత భాగాన్ని, ఉత్సవ కమిటీ సభ్యుల కోసం మరికొంత భాగాన్ని కేటాయించారు. మిగతా లడ్డూను ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య లడ్డూను గణేష్ ఉత్సవ కమిటి వేదికపై ఉంచారు.

లడ్డూ ప్రసాదం కోసం పెద్ద యెత్తున భక్తులు ఖైరతాబాద్‌కు తరలివచ్చారు. దీంతో సైఫాబాద్ ఏసీపీ మహ్మద్ ఇస్మాయిల్ నేతృత్వంలో నలుగురు ఇన్స్‌పెక్టర్లు, 15 మంది ఎస్‌ఐలు, 4 ప్లాటూన్‌ల పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ అశోక్ బుధవారంనాడు తెలిపారు.












Click it and Unblock the Notifications