తణుకులో రెండో రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమం
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల క్రితం కిడ్నాప్ గురైన బచ్చి హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు క్షేమంగా ఉన్నాడు. ఈ రోజు మధ్యాహ్నాం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని ఆటోలో తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్లారు.
మంగళవారం పాఠశాలకు వెళుతున్న బాలుడిని కొంతమంది వ్యక్తులు హోండా యాక్టివా మీద వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ ఇస్తానని మభ్యపెట్టి సోమవారం బాలుడిని అపహరించారు. పట్టణంలోని గణేష్ నగర్ బచ్చు జంగం చెరువు ప్రాంతంలో వడ్రంగి పనిచేసే బచ్చు నూకరాజుకు భార్య పద్మావతి, పిల్లలు పూజిత, హేమంత్ వెంకటేశ్వరరావు ఉన్నారు.

పూజిత, హేమంత్ మంగళవారం నడుచుకుంటూ జంగం చెరువు ప్రాంతంలోని జవహర్లాల్ నెహ్రూ ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్నారు. మోటారు సైకిల్‌పై వచ్చిన ఆగంతకుడు వారిని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. పూజిత కేకలు వేయడంతో ఆమెను వదిలి హేమంత్‌ను తీసుకుని ఆగంతకుడు పరారయ్యాడు. ఈ కిడ్నాప్ దృశ్యాలను సీసీటీవీ కెమెరా బంధించింది.
బాలుడి తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి తండ్రి నూకరాజు వడ్రంగి పని నిమిత్తం ఐదు రోజులుగా రాజమండ్రిలో ఉంటున్నారు. అప్పటినుంచి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
బాలుడుని పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసినట్లు పట్టణ ఎస్సైకె శ్రీనివాసరావు తెలిపారు. ఏమైనా కుటుంబ కలహాల, బయటవ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తుచేస్తున్నామన్నారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈలోగానే వారు బాలుడిని వదిలివెళ్లారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications