అల్లు అర్జున్ నీ పతనం మొదలైంది గుర్తు పెట్టుకో
ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఇంకా చల్లారలేదు. ఈ ఎన్నిల్లో ఎవరు ఊహించని విధంగా కూటమి విజయం సాధించింది. తమదే విజయమని వైసీపీ అభిమానులు, కూటమి అభిమానులు నేతలు భావించారు.కానీ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికి పలు ప్రాంతాలలో అల్లర్లు గొడవలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ అభిమానులు కమెడియన్ కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన హోటల్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ కూటమికి మద్దతు ప్రకటించారు. కిరాక్ ఆర్పీ అక్కడితో ఆగకుండా వైసీపీ నేతలపై ముఖ్యంగా కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలలో కూటమి అధికారంలోకి రావడంతో ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కూటమి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్‌ను కూడా విమర్శించారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడని.కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని తెలిపారు.అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపకపోవడం ముమ్మాటికి తప్పని ఈయన చెప్పడమే కాకుండా బన్నీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఒకనొక సమయంలో తన స్థాయిని మరిచి అల్లు అర్జున్‌పై కిర్రాక్ ఆర్పీ విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్‌పై అభిమానులు దాడికి పాల్పడ్డారు. ఆయన చేపల పులుసు రెస్టారెంట్ పై దాడులు చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ దాడిపై కిర్రాక్ ఆర్పీ స్పందించారు. అల్లు అర్జున్‌కు కిర్రాక్ ఆర్పీ వార్నింగ్ ఇచ్చారు.
నేను మిమ్మల్ని విమర్శిస్తే..నన్ను ఏమైన చేసుకోండి అంతే కానీ మా ఇంట్లో ఆడవాళ్లు ఏం చేశారంటూ అల్లు అర్జున్‌ను కిర్రాక్ ఆర్పీ ప్రశ్నించారు. నీ పేరు అల్లు అర్జున్ అయితే .. నా పేరు కిర్రాక్ ఆర్పీ.. నీ ఫ్యామిలీ నీకుంటే నా ఫ్యామిలీ నాకుంటుందని అల్లు అర్జున్‌ను కిర్రాక్ ఆర్పీ హెచ్చరించాడు. ఇంట్లో ఆడవాళ్ల జోలికి వస్తే పతనం ఇక్కడ నుంచే మొదలైందని అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోవాలని కిర్రాక్ ఆర్పీ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications