దమ్ముందా, రాజకీయాలొదిలేస్తా: ఢిల్లీకి కిరణ్, ప్రజలవైపే

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఆయన కేంద్రానికి సవాల్ విసిరారు. కేంద్రం అసెంబ్లీకి పంపించిన బిల్లునే పార్లమెంటులో ప్రవేశ పెడితే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పు కుంటానని ప్రతిజ్ఞ చేశారు. అదే బిల్లును పెట్టే దమ్ముందా అన్నారు. ఇక్కడ ఏది జరిగినా పార్లమెంటు ఆమోదిస్తుందని చెబుతున్న వారు శాసన సభలో ఓటింగుకు ఎందుకు అడ్డు పడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు.

బిల్లులో 9,024 సవరణలు వస్తే చర్చ, ఓటింగు లేకుండా ఎలా అనుమతిస్తారన్నారు. ఇదే బిల్లును కనుక పార్లమెంటులో పెట్టేందుకు అనుమతిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన అసెంబ్లీ అభిప్రాయం చెప్పాలి, కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓటింగుకు అడ్డు పడటం సరికాదన్నారు. రాజ్యసభ కన్నా విభజన అంశం చాలా కీలకమైనదని చెప్పారు.

Kiran Kumar Reddy

తాను బిల్లును మార్చమని అడగటం లేదని, పార్లమెంటులో ప్రవేశ పెట్టవద్దని చెబుతున్నానని చెప్పారు. బిల్లు పైన ఓటింగుకు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 86 మంది మాట్లాడితే అసెంబ్లీ అభిప్రాయం చెప్పినట్లా అని ప్రశ్నించారు. బిల్లులోని లోపాలు ఎత్తి చూపేందుకే తాను మరో మూడు వారాల సమయాన్ని కోరినట్లు చెప్పారు. విభజనపై వారి ఉద్దేశ్యం చెప్పకుండా ఏ ప్రాతిపదికన ఈ సభ అభిప్రాయం చెప్పాలని ప్రశ్నించారు.

విభజనకు తాను వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని, తెలుగు ప్రజలు కలిసి ఉండాలనేదే తన అభిప్రాయమన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన ప్రతి అంశానికి ప్రాతిపదిక ఉందన్నారు. రాష్ట్రపతికి గడువు పెంపు కోసం లేఖ రాశానని, పెంచుతారో లేదో చూడాలన్నారు. గత రాష్ట్రాల విభజన పరిస్థితులు వేరని, ఇప్పటి పరిస్థితులు వేరన్నారు. ఈ సభకు అధికారం లేదంటున్న తెలంగాణ నేతలు ఓటింగుకు అంగీకరించాలని అభిప్రాయపడ్డారు. సభ అభిప్రాయం అవసరం లేనప్పుడు నేరుగా పార్లమెంటే విభజన చేయవచ్చు కదా అన్నారు.

ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యసభ బరిలో రెబల్ అభ్యర్థులు నిలబడ్డారన్నారు. తప్పుకోవాలని వారిని తాను కోరానని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను నోటీసును ఇచ్చానని చెప్పారు. ఈ రోజే బిల్లుపై తీర్మానం పెట్టాలని సీమాంధ్ర నేతలు సభాపతిని కోరారన్నారు. తనకు కాంగ్రెసు కావాలా, ప్రజలు కావాలా అంటే ప్రజల వైపే నిలబడతానని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+