కిరణ్ సొంత నివేదిక: హరీష్ రావు, మీకేం బాధ: పొన్నం

రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన సొంత నివేదికనే రాష్ట్ర ప్రభుత్వ నివేదికగా పంపించారని విమర్శించారు. మంత్రివర్గ ఆమోదం లేని నివేదికను మంత్రుల బృందానికి ఎలా పంపిస్తారన్నారు.
కళ్లుండి చూడలేని కబోది: కెటిఆర్
ముఖ్యమంత్రి కళ్లుండి చూడలేని కబోది అని తెరాస మరో ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు మండిపడ్డారు.
మాకు నష్టం జరిగితే మీకేం బాధ?: పొన్నం
హైదరాబాదు శాంతిభద్రతల పైన ముఖ్యమంత్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. తమకు నష్టం జరిగితే ముఖ్యమంత్రికి ఎందుకు అంత బాధ అని ప్రశ్నించారు. నల్గొండకు అన్యాయం చేసి చిత్తూరుకు నీళ్లు తీసుకు వెళ్లినప్పుడు బాధ కలగలేదా అన్నారు. జివోఎంకు ముఖ్యమంత్రి వ్యక్తిగత నివేదిక మాత్రమే పంపారన్నారు.
కిరణ్ హస్తం: వివేక్
విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ల వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని కరీంనగర్ ఎంపి, తెరాస నేత వివేక్ ఆరోపించారు. ఆయనకు విభజన ఇష్టం లేకుంటే పదవికి రాజీనామా చేయాలన్నారు.
ఢిల్లీకి వెళ్లి చెప్పాలి: షబ్బీర్
ఢిల్లీకి వెళ్లి చెప్పాల్సిన విషయం చెప్పకుండా కిరణ్ రచ్చబండలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు.












Click it and Unblock the Notifications