సీల్డ్ కవర్ సిఎం ఉంటే ఎంత పోతే ఎంత: దామోదర ఫైర్

శనివారం తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన గుర్రం జాషువా 118వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. కిరణ్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఫజల్ అలీ కమిషన్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నివేదిక ఇచ్చిందన్నారు.
తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో చేర్చినప్పుడు కిరణ్ ఏ పార్టీలో ఉన్నారని, తెలంగాణ ప్రజల ఓట్లు మాత్రమే కావాలి వారి ఆకాంక్ష అక్కర్లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎంత ముఖ్యమో, సీమాంధ్ర ప్రజలూ అంతే ముఖ్యమన్నారు. కిరణ్ చెబుతున్నట్లుగా జల వివాదాలేవీ రావని, తగిన చట్టాలున్నాయని తెలిపారు.
చివరి బంతిదాకా మ్యాచ్ ముగియనట్లేనన్న కిరణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ బంతీ లేదు.. బ్యాటూ లేదని విమర్శించారు. ఒకసారి కిరణ్ చరిత్ర చూడాలన్నారు. దశాబ్బాదల కాలంగా తెలంగాణ ప్రజలపై సీమాంధ్రులే పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ కల సాకారం కాబోతుందని, ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదన్నారు. కిరణ్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదని, సీల్డ్ కవర్ సిఎం అని, ఆయన ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు.












Click it and Unblock the Notifications