టీ బిల్లు: సవరణలు ఇవ్వని కిరణ్, బొత్స, చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ (తెలంగాణ) ముసాయిదా బిల్లుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఏ విధమైన సవరణలు ప్రతిపాదించలేదని సమాచారం. అలాగే, ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా సవరణలు ప్రతిపాదించలేదని తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అధికారిక ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, మజ్లీస్ సవరణలను ప్రతిపాదించింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయకూడదని మజ్లీస్ ప్రతిపాదించింది. మజ్లీస్ 31 సవరణలను ప్రతిపాదించింది.

ఉమ్మడి గవర్నర్, ఉమ్మడి హైకోర్టు ప్రతిపాదనలను కూడా మజ్లీస్ వ్యతిరేకించింది. సీమాంధ్రకు హైదరాబాద్‌ను రెండేళ్ల పాటు రాజధానిగా కొనసాగించాలని సూచించింది. హైదరాబాద్ శాంతిభద్రతలు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలని అభిప్రాయపడింది.
తెలంగాణకు ప్రత్యేక సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, 371డిని కొనసాగిస్తున్నందున ఉన్నత విద్యలో ప్రవేశాలకు మినహాయింపులు అవసరం లేదని చెప్పింది. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా కల్పించాలని మజ్లీస్ ప్రతిపాదించింది.












Click it and Unblock the Notifications