జాగ్రత్తగా..: కెటిఆర్‌కి కిరణ్ వార్న్, పేపర్ చూసుకోవచ్చని

తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాతనే తమ పార్టీ (కాంగ్రెస్) తీసుకుందన్నారు. తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. రైతులకు, బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుందనే నాడు విశాలాంధ్రకు ప్రజలు మద్దతు పలికారన్నారు.
అయితే, కిరణ్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, నాగం జనార్ధన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కిరణ్ ఘాటుగా స్పందించారు. ఈ బిల్లు పైన సుదీర్ఘంగా మాట్లాడాల్సిన అవసరం తన పైన ఉందని చెప్పారు. తాను తన జీవితంలో ఎప్పుడు కూడా మాట మార్చలేదన్నారు. వారు ఏ పేపర్ చూసుకుంటారో చూసుకోవచ్చునని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్ర మనం రాసేది కాదని అన్నారు. చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. భారతీయ జనతా పార్టీ నుండి నీతివ్యాఖ్యలు నేర్చుకోవాల్సిన దుస్థితి తనకు లేదన్నారు. నాగం జనార్ధన్ రెడ్డిలా తాను పదే పదే అభిప్రాయాలు మార్చుకోననన్నారు.
కెటిఆర్ చాలా చిన్నవాడు..
కిరణ్ స్పీచ్‌పై తెరాస సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అభ్యంతరం వ్యక్తం చేయగా.. కెసిఆర్ ఈ సభలో చాలా చిన్నవాడని, కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలన్నారు. అదే పనిగా తెరాస సభ్యులు కిరణ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో మీకు డిస్టర్బ్ చేయాలనిపిస్తే మీ ఇష్టం అన్నారు. కిరణ్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా లేక సభా నాయకుడిగా మాట్లాడుతున్నారా చెప్పాలని జానా రెడ్డి ప్రశ్నించగా.. క్లారిఫికేషన్ ఇవ్వాలని టి సభ్యులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications