రాజకీయాల్లో లేను.. చెప్పను: కిరణ్ రెడ్డి, జనసేన పార్టీలో చేరుతున్నారా?
నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
విజయవాడ: నోట్ల రద్దు అంశంపై సమైక్య ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం నాడు స్పందిచేందుకు నిరాకరించారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియా ఆయనను నోట్ల రద్దు అంశంపై ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు. అసలు తాను రాజకీయాల్లో లేనని, ఈ విషయమై స్పందించనని చెప్పారు.

అదే సమయంలో జనసేన పార్టీలో చేరుతారని, భారతీయ జనతా పార్టీలో చేరరని అంటూ.. ఓ విలేకరి ప్రశ్నించారు. దానిపై కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను ఆ విషయాలు ఏమీ చెప్పదలుచుకోలేదని అన్నారు. నేను ఆ విషయాలు ఎప్పుడూ చెప్పలేదన్నారు.












Click it and Unblock the Notifications