పీసీపీ చీఫ్ ఇస్తామన్నారు, కానీ - టీడీపీతో పొత్తుపై కిరణ్ వ్యాఖ్యలు..!!

బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. తనకు రాహుల్ గాంధీ మధ్య కొన్ని అంశాల పైన చర్చ జరిగిందన్నారు. తనకు ఏపీ పీసీసీ చీఫ్ గా ఆఫర్ ఇచ్చారని. కానీ తాను వద్దని చెప్పినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ బలోపేతం చేయాలని తాను ప్రయత్నించినా సాధ్యపడలేదన్నారు. బీజేపీ పని చేస్తున్న తీరు తనను ఆకట్టుకుందని చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనేది పార్టీ నిర్ణయం మేరకే ఉంటుందన్నారు. టీడీపీతో నాడు కాంగ్రెస్ పొత్తు నిర్ణయంపై భిన్నంగా స్పందించారు.

బీజేపీలో చేరిన కిరణ్ ను ఏపీకి చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాము కాంగ్రెస్ లో అరవై సంవత్సరాలు తమ కుటుంబంలో కొనసాగిన విషయాన్ని గుర్తు చేసారు. అనేక పరిణామాల కారణంగా తానురాష్ట్ర విభజనను వ్యతిరేకించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. విభజన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలకు అనుగుణంగా నడవాల్సిన అవసరం ఉందన్నారు. కొంత కాలం తాను కాంగ్రెస్ కు దూరంగా ఉన్నా తిరిగి అదే పార్టీలో చేరానన్నారు. నాయకులు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచన చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి పని‌ చేయాలని చూశానని , కానీ అక్కడ నిర్ణయాలు ఒక్కో రాష్ట్రం లో పార్టీ దెబ్బ తినే పరిస్థితి ఉందన్నారు.

 kirankumarreddy

తామంతా కలిసి పని చేసి కాంగ్రెస్ కు ఓటు శాతం పెంచామని కిరణ్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బలోపేతం అవుతున్న సమయంలో టిడిపి తో పొత్తుకు వెళ్లారని గుర్తు చేసారు. దీంతో, తాను ఎవరినీ అడగకుండా, చర్చించకుండా నిర్ణయాలు వల్ల బయటకి వచ్చానని వెల్లడించారు. ప్రధాని మోదీ పాలన నచ్చి, ప్రజలకు చేయవచ్చనే నమ్మకంతోనే బీజేపీలో చేరానన్నారు. తన తండ్రి కాలం నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. పార్టీ నాయకత్వం కాంగ్రెస్ బలోపేతం పై‌ వారు దృష్టి పెట్టలేదన్నారు. బిజెపి గ్రామ స్థాయిలో బలం పెంచుకునే కార్యక్రమం చేపట్టిందన్నారు. ఎన్నికలలో గెలుపు, ఓటమి సహజం అయినా... పరిస్థితి బట్టి నిర్ణయాలు ఉండాలని కిరణ్ విశ్లేషించారు.

 kirankumarreddy

ఈ పరిస్థితుల్ల ోతాను అసలు ప్రజల మధ్యన నేను ఉండాలా లేదా అని ఆలోచించానన్నారు.కాంగ్రెస్ వల్ల ప్రజలకు చేరువ కాలేనని అర్ధం అయ్యిందని చెప్పారు. బిజెపి లో ఉంటే ప్రజలకు దగ్గర కావచ్చనే నేను చేరానని వివరించారు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది త్వరలోనే మాట్లాడతానని కిరణ్ వ్యాఖ్యానించారు. అన్ని‌ ప్రాంతీయ పార్టీ ల తీరు పైనా అప్పుడు స్పందిస్తానని చెప్పారు. తాను పదవులు.. సీట్లు ఆశించి బీజేపీలో చేరలేదని చెప్పుకొచ్చారు. బిజెపి బలోపేతం కోసం తన వంతుగా కృషి చేస్తానని స్పష్టం చేసారు. తన పోటీ గురించి ఎటువంటి చర్చ జరగలేదని..పార్టీ పోటీ చేయమని చెబితే తాను పోటీ చేస్తానని కిరణ్ చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తానని కిరణ్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+