లాస్ట్ మినట్లో కొత్తపార్టీతో కిరణ్ రికార్డ్: టిజి, 'జగన్ పెద్ద..'
హైదరాబాద్: అసెంబ్లీ లాబీల్లో చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు ఆదినారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల బుధవారం మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. టిజి మాట్లాడుతూ.. తనకు మూడు పార్టీల నుండి ఆహ్వానం ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు కలిసి మాట్లాడుకుంటే రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ చివరి నిమిషంలో పార్టీ పెట్టి రికార్డు సృష్టించవచ్చన్నారు. ఈ నెల 23వ తేదీ తర్వాత కిరణ్ పార్టీ పెట్టవచ్చునని అభిప్రాయపడ్డారు.

టిజి వ్యాఖ్యలకు స్పందించిన శ్రీనివాసులు.. మీరు ప్రముఖ నేత అని, ఎవరైనా ఆహ్వానిస్తారని, తమ పార్టీలోకి వస్తే స్వాగతించి, సీటిస్తామని చెప్పారు. దీంతో పక్కనే ఉన్న ఆదినారాయణ రెడ్డి.. సీటు ఇస్తావా లేక ఇప్పిస్తావా చెప్పాలన్నారు. మనం ఒప్పుకున్నా మన పెద్ద దేవుడు(వైయస్ జగన్) ఒప్పుకోవాలి కదా అన్నారు. మనం కేవలం అడ్వోకేట్లమని, జగన్ జడ్జి అన్నారు.
కొత్త పార్టీ ఆలోచనలో కిరణ్: ఆదాల
ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెట్టే అవకాశాలున్నాయని ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను లోకసభకు పోటీ చేస్తానని చెప్పారు. కాంగ్రెసు పార్టీ సీమాంధ్రలో దుకాణం మూసేస్తే కొత్త పార్టీ నుండి పోటీ చేస్తానన్నారు. కాంగ్రెసు పార్టీ టిక్కెట్ కోసం ముసలోళ్లు క్యూలో ఉన్నారన్నారు. ఒక్కో సీటుకు కాంగ్రెసు పార్టీ రెండు కోట్లు ఇవ్వనుందన్నారు. ఏ పార్టీలో సీటు దక్కని వాళ్లు కిరణ్ పార్టీలోకి వస్తారన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు కిరణ్ మౌనంగా ఉండమని చెప్పారన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications