సిఎం మార్పు: నవ్వుతూ కారెక్కి వెళ్లిన కిరణ్ రెడ్డి, లైట్

Kiran participated in children's day
హైదరాబాద్: తన ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. సిఎం మార్పుపై అడిగితే నవ్వుతూ స్పందించకుండా వెళ్లిపోయారు. గురువారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ఆయనను మీడియా పలకరించింది. ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించనున్నారా అని అడిగితే.. ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు.

అంతకుముందు కార్యక్రమంలో మాట్లాడుతూ... ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మ్యాచ్ ఆడుతుంటే చూసే అవకాశం ఉందని కానీ తమకు అప్పట్లో అది లేదని కిరణ్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులను ఉద్దేశించి మాట్లాడారు.

అందరూ బడికి పోయేలా, ఆడపిల్లలను బడికి పంపించేలా ప్రతిజ్ఞ తీసుకుందామన్నారు. ముప్పయ్యేళ్ల క్రితం ఇంత టెక్నాలజీ లేదని అప్పుడు తమకు సెల్‌ఫోన్, టీవిల గురించి తెలియదన్నారు. ఇప్పుడు సచిన్ ఆడుతుంటే పిల్లలు ప్రత్యక్షంగా టీవిల్లో చూస్తున్నారని, తాము మాత్రం రేడియోల్లో కామెంట్రీ వినే వాళ్లమన్నారు.

ఇలాంటి టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. ప్రపంచం ఓ కుగ్రామంలా తయారయిందని, విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ రోజు మీకున్న అవకాశాలు తమకు అప్పుడు లేవన్నారు.

అమెరికాలో చేసే పనిని హైదరాబాదు నుండి చేస్తున్నామని, ప్రపంచంలోని యాభై శాతం విమానాలకు హైదరాబాదు నుండి సూచనలు ఇస్తున్నారని, మంగళయాన్‌కు చెందిన పలు విడి భాగాలను హైదరాబాదులోనే చేశామని చెప్పారు. టెక్నాలజీతో పాటు మనం దూసుకెళ్లాలన్నారు.

ప్రతి ఒక్కరు చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని నెహ్రూ చెప్పారని, చదువుతోనే ఆలోచన పరిణితి వస్తుందన్నారు. విద్యార్థులు తాము ఏ రంగంలో రాణిస్తారో తమను తాము తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడితే ప్రపంచంలో భారత్ నెంబర్ వన్ అవుతుందని, భారత్, చైనా విద్యార్థులు బాగా కష్టపడతారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కితాబిచ్చారన్నారు.

విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలే గాని కష్టపడి చదువొద్దని సూచించారు. ఉన్నత శిఖరాలు చేరేందుకు రెండు మార్గాలు ఉంటాయని సరైన మార్గంలో వెళితే కష్టపడినా విజయం సాధిస్తామని, అందులో సంతోషం ఉంటుందన్నారు. అడ్డదారిలో వెళ్లి గెలిస్తే అది అసలైన విజయం కాదన్నారు. కష్టపడకుండా ఏదీ మన వద్దకు రాదని తెలుసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+