బాపూజీకి నివాళి: దానం వైపు కిరణ్ చూపు (పిక్చర్స్)
హైదరాబాద్: అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం ఉదయం నివాళులు అర్పించారు. కిరణ్‌తో పాటు సభాపతి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తదితరులు నివాళులు అర్పించారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు తదితరులు నివాళులు అర్పించారు.
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విజయవాడలో మహాత్ముడికి నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినతి పత్రాన్ని ఇచ్చారు.

మహాత్మా గాంధీ 1
అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు.

మహాత్మా గాంధీ 2
అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ తదితరులు.

మహాత్మా గాంధీ 3
జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే వంగా గీతా, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు.

మహాత్మా గాంధీ 4
అసెంబ్లీలోని జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన శాసన సభ సభాపతి నాదెండ్ల మనోహర్, ఇతర నాయకుల దృశ్యం.

మహాత్మా గాంధీ 5
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బాపూఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు.

మహాత్మా గాంధీ 6
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బాపూఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు. దానం నమస్కారం పెడుతూ ఏదో మాట్లాడుతుండగా అందరు అతని వైపు చూస్తున్న దృశ్యం.

మహాత్మా గాంధీ 7
హైదరాబాదులోని బాపూఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులు అర్పించిన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి, నరసింహన్ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్న దృశ్యం.

మహాత్మా గాంధీ 8
బాపూఘాట్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహంపై పూలవర్షం కురిపిస్తున్న విద్యార్థులు. బాపూఘాట్ వద్ద పలువురు నివాళులు అర్పించారు.

మహాత్మా గాంధీ
హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద పిఆర్‌టియు ఆధ్వర్యంలో తెలంగాణకు మద్దతుగా జరిగిన ధర్నాలో జాతిపిత మహాత్ముడికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications