విభజనపై వీడియో సాక్ష్యం: కిరణ్ టార్గెట్ ఏమిటి, కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చేనా?

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో.. ముఖ్యమంత్రిగా ఉంటూనే సమైక్యాంధ్ర నినాదంతో అధిష్టానం (కాంగ్రెస్)ను వ్యతిరేకించారు. విభజన అంశం, కిరణ్ రెడ్డి అధిష్టానాన్ని నిలదీయడం అప్పుడు జాతీయ మీడియాలో, జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

తాజాగా, విభజన సమయంలో తెర వెనుక రాజకీయాల పైన పుస్తకం రాస్తానని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన చేసినట్లుగా వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. కిరణ్ రెడ్డి నాలుగు వందల పేజీల పుస్తకం రాస్తున్నారు. అది దాదాపు పూర్తయింది. అందులో కిరణ్ రెడ్డి ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల గురించి ఏం రాస్తారు? అనే చర్చ సాగుతోంది. హైకమాండుకు పంపిన నివేదికలను ప్రధానంగా ప్రస్తావించొచ్చు.

కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల ద్వంద్వ వైఖరిల పైన పుస్తరంలో రాస్తానని చెప్పారు. అందులో ఆయన వారు గురించి ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, విభజన సమయంలో జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలకు వీడియో ఆధారాలు ఉన్నాయని కిరణ్ రెడ్డి చెప్పడం గమనార్హం.

ఈ పుస్తకం కిరణ్‌ను మళ్లీ తెరపైకి తీసుకు వస్తుందా?

Kiran Reddy refused to share details of the book

విభజన సమయంలో అధిష్టానాన్ని వ్యతిరేకించి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ఆయన మళ్లీ రాజకీయాల్లో చురుకు అవుతారా అనే చర్చ సాగుతోంది.

ఆ పుస్తకంలో ఏముంటాయి?

కిరణ్ కుమార్ రెడ్డి రాసే పుస్తకంలో ఏం ఉంటాయి? అంటే సోనియాతో, ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చించిన అంశాలు ఉండవచ్చునని అంటున్నారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతల తీరు, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబును కూడా పుస్తకంలో ప్రస్తావించవచ్చునని చెబుతున్నారు.

విభజన సమయంలో జరిగిన అంశాల గురించి పుస్తకం రాస్తున్న కిరణ్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చేందుకు కొన్ని పేజీలు అయినా కేటాయిస్తారా? అనేది కూడా ఆసక్తికర అంశం. విభజనకు ముందు తెరాస లేదా తెలంగాణవాదులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఆయన మ్యాప్ చూపించి మరీ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన తెరాస గురించి పేర్కొనవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+