• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టిపై సుష్మా: కిషన్ రెడ్డికి కోపమొచ్చింది, మీడియా పైనా

By Srinivas
|

హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు సంబంధించి పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ మాటలకు వక్రభాష్యాలు చెబుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆమెను విమర్శిస్తే అమర వీరుల ఆత్మలు క్షోభిస్తాయని, తెలంగాణ ప్రజల హృదయాల నుంచి సుష్మా స్వరాజ్‌ను తొలగించలేరన్నారు. పార్టీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డితో కలిసి కిషన్ సోమవారం మీడియాతో మాట్లాడారు.

సుష్మాస్వరాజ్ తన మాటల్లో ఎక్కడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు. తెలంగాణ కోసమే పుట్టామంటున్న పార్టీ, వారి టివి చానల్ కంటే తెలంగాణ ఉద్యమానికి సుష్మా స్వరాజ్ సేవే ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీ ముందుగా వారి ఇల్లును చక్కదిద్దుకోవాలని సూచించారు.

Kishan Reddy clarifies Sushma remerks

తెలంగాణపై తమ పార్టీ నిర్ణయంలో ఎటువంటి మార్ప లేదని, కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నానని, దమ్ము, ధైర్యం ఉంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి మొట్టమొదటగా తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామన్నారు. సీమాంధ్రులకు లాభాల గురించి కాంగ్రెస్ గానీ, ప్రభుత్వంగానీ ఒక్క ప్రకటనైనా చేసిందా అని ప్రశ్నించారు. సుష్మ వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చెప్పవద్దంటూ కొన్ని టీవీ చానళ్లకు సూచించారు.

ఇప్పటికే అటూ, ఇటూ ప్రజల్లో భయం ఉందని తెలంగాణ రాదన్న ఆందోళన కలిగితే విపరీత ఘటనలూ జరిగే పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రకటన చేసి వెనక్కు తీసుకుని 1100 మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అని, ఇప్పుడా పార్టీ నేతలు తెలంగాణ పేరుతో తిరుగుతూ జాతర చేస్తున్నారని మండిపడ్డారు. అది ఓట్ల జాతరే అన్నారు. శవాలపై ఓట్లు రాల్చుకోవాలని చూస్తున్నారని, బిజెపిని పల్లెత్తుమాట అనే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు.

జాతీయ పార్టీగా సీమాంధ్ర సమస్యలనూ పరిష్కరించాల్సిన బాధ్యత బిజెపిపై ఉందన్నారు. బిల్లుపై తాము సూచించిన సవరణలను తీసుకున్నా తీసుకోకపోయినా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వచ్చాక సవరణలు చేస్తామన్నారు. కాగా అవినీతి నిరోధక బిల్లు, మహిళా బిల్లు తదితర బిల్లుల్లో 39వ బిల్లుగా తెలంగాణను కూడా తీసుకున్నామంటూ కమల్‌నాథ్ చెబుతున్నారని, ఈ 12 రోజుల సెషన్లో అది సాధ్యమవుతుందా అని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. సభను సజావుగా నడిపించాలనే సుష్మా స్వరాజ్ కోరారని తెలిపారు.

English summary
Bharatiya Janata Party state president Kishan Reddy 
 
 on Monday clarified about Sushma Swaraj remarks, said 
 
 they will exodus Congress, not oppose Telangana Bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X