లష్కర్ నుంచి కిషన్ రెడ్డి: జవదేకర్‌కు ఇందూరు

లోకసభ అభ్యర్థుల ఖరారుకు బిజెపిలో కొద్ది రోజులుగా కసరత్తు సాగుతోంది. గురువారం ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రముఖ్ శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. తెలంగాణలోని 17 స్థానాలపై సూత్రప్రాయ అవగాహనకు వచ్చారు. టికెట్లు ఆశిస్తున్నవారి పేర్లను జాబితాలో చేర్చారు. వీరిలో ఒక్కరినే ఎంపిక చేసే అధికారాన్ని పార్టీ పార్లమెంటరీ బోర్డుకు అప్పగిస్తారు.
సికింద్రాబాద్ నుంచి తిరిగి పోటీ చేయడానికి బండారు దత్తాత్రేయ పట్టుబడుతున్నారు. బిజెపి నేతలు ఎక్కువగా పార్లమెంటుకు పోటీ చేయడానికే ఆసక్తి కనబరుస్తున్నారు. కిషన్‌రెడ్డి కూడా పార్లమెంటు స్థానంపై కన్నేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాదులోని అంబర్‌పేట నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ పైకి చెబుతున్నా అంతర్గతంగా ఆయన సికింద్రాబాదు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
17 ఎంపి సీట్లకు ఆశావహులు వీరే...
తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు ఆశావహుల జాబితా తయారైంది. హైదరాబాద్ నుంచి గణేష్ ఉత్సవ సమితి చైర్మన్ భగవంతరావు, సతీష్ అగర్వాల్, నంద బిలాల్ వ్యాస్, రాజాసింగ్, సికింద్రాబాద్ నుంచి దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, మల్కాజిగిరి నుంచి రామచంద్రారావు, ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రెడ్డి, భువనగిరి నుంచి ఇంద్రసేనారెడ్డి, కొమ్మూరి ప్ర తాప్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, టి.రాజేశ్వర్‌రావు, వెదిరె శ్రీరాం, జంగారెడ్డి టికెట్లు ఆశిస్తున్నారు.
నల్గొండ నుంచి వెదిరె శ్రీరాం, గోలి మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి నాగం జనార్దన్‌రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి బంగారు లక్ష్మణ్ కూతురు శృతి, మాజీ మంత్రి పుష్పలీల, మాజీ ఎమ్మెల్యే ఇందిర, చేవెళ్ల నుంచి బద్దం బాల్‌రెడ్డి, అశోక్ కుమార్ యాదవ్, శైలేష్‌రెడ్డి, అంజన్‌కుమార్ గౌడ్, ఖమ్మం నుంచి కపిలవాయి రవీందర్, డా.విజయలక్ష్మి, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, జైపాల్, పరమేశ్వర్, మహబూబాబాద్ నుంచి చందా లింగయ్య దొర, దిలీప్ నాయక్, ఉషారాణి ఆశిస్తున్నారు.
కరీంనగర్ నుంచి సి.హెచ్ విద్యాసాగర్‌రావు, పి.మురళీధర్‌రావు, జంగారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, పెద్దపల్లి నుంచి ఎస్.కుమార్, బోడ జనార్దన్, ఆదిలాబాద్ నుంచి శ్రీరాం నాయక్, మడావి రాజు, నిజామాబాద్ నుంచి ప్రకాష్ జవదేకర్, యెండల లక్ష్మీనారాయణ, అల్జాపూర్ శ్రీనివాస్, డా.హన్మంత్‌రెడ్డి, మెదక్ నుంచి నరేంద్రనాథ్, రాజిరెడ్డి, జహీరాబాద్ నుంచి ఆలె భాస్కర్, లక్ష్మారెడ్డి, భాగన్న పేర్లు పరిశీలనలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications