Chandrayan-3: చంద్రయాన్-3 వెనుక తెలుగు తేజాలు.. ఆ ముగ్గురి పాత్ర ఇదే..

Chandrayan-3: దేశంతో పాటు ప్రపంచం గర్వించిన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ వెనుక అనేక మంది శాస్త్రవేత్తల నిరంతర శ్రమ ఉంది. అయితే ఇందులో పనిచేసిన కొందరు తెలుగు తేజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ క్రమంలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది చంద్రయాన్-3 మిషన్ డైరెక్టర్ శ్రీకాంత్ గురించి. విశాఖలోని సీతమ్మధార స్వస్థలమైన శ్రీకాంత్ తన డిగ్రీ మెుదటి సంవత్సరం మచిలీపట్నంలో పూర్తి చేశారు. అయితే మిగిలిన రెండేళ్ల విద్యను విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో చదివారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో Msc ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేశారు.

Know about three telugu scientists part of chandrayan3 mission

ఆ తర్వాత ఇండోర్ లో ఎంటెక్ పూర్తి చేసిన ఆయన ఇస్రోలో శాస్త్రవేత్తగా ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్స్ మిషన్ కు ఆపరేషన్ డైరెక్టర్‌గా, చంద్రయాన్-2కి డిప్యూటీ మిషన్ డైరెక్టర్‌గా, చంద్రయాన్-3కి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం శ్రీకాంత్ బెంగళూరులో నివాసం ఉంటున్నారు.

చంద్రయాన్-3 మిషన్ ప్రయోగంలో అనేక మంది స్త్రీల పాత్ర కూడా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిలో తెలుగు మహిళలు ఇద్దరు ఉన్నారు. వీరు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినవారు కావటం గమనార్హం. ముందుగా శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయంలో చదుపు పూర్తి చేసిన ఉషశ్రీకాంత్ ఉన్నారు. అలాగే అనంతపురానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త సాయిచందన సైతం చంద్రయాన్-3 విజయవంతం కావటంలో తన పాత్రను పోషించారు. ఏపీకి చెందిన ముగ్గురు శాస్ర్తవేత్తలు మూన్ విషన్ లో భాగస్వాములు కావటంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+