Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైలుకు గేర్లు ఉంటాయా? వేగం ఎలా పెరుగుతుందో తెలుసా?

నాచ్ వ్యవస్థపై రైలు వేగం ఆధారపడివుంటుంది. 1 నుంచి 8 వరకు.. 8వ నాచ్ లో ఉంటే రైలు టాప్ గేర్ లో వెళుతుందని అర్థం.

రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్ వేగం ఎలా మారుతుందనే సందేహం చాలామందికి వస్తుంది. మన ద్విచక్ర వాహనానికి, కారుకు ఉన్నట్లే గేర్లు ఉంటాయా? రైలుకు గేర్లు మారుస్తారా? అనే అనుమానాలు వస్తుంటాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..

కిటికీ దగ్గరగా కూర్చొని..

కిటికీ దగ్గరగా కూర్చొని..


పట్టాలపై వేగంగా వెళుతున్న రైలులో కిటికీ దగ్గర కూర్చుని ప్రపంచాన్ని చూడాలనుకుంటారు కొందరు. ఊరికి దూరంగా కూ.. చుక్ చుక్... అంటూ వేగంగా వెళ్లే రైలు గురించి తెలుసుకోవాలని మరికొందరికి ఉంటుంది. నాచ్ అంటే ఏంటి? : సాధారణ వాహనాలకు ఉన్నట్లుగానే రైళ్లకు కూడా గేర్లుంటాయి. ఇంజన్, రైలు రకం ఆధారంగా వాటికి పేర్లు పెడతారు. డీజిల్ ఇంజిన్‌కు ఉండే గేరు వ్యవస్థని 'నాచ్' అంటారు. బండిలో 8 నాచ్‌లు ఉంటాయి. అంటే 8 గేర్లు అన్నమాట. 1 నుంచి 8 వరకు వరుసగా ఒకదాని వెంబడి మరొకటి వేస్తే రైలు వేగం పెరుగుతూ వెళుతుంది. వేగాన్ని పెంచుకోవడానికి ఒక్కో నాచ్‌ని పెంచుకుంటూ పోవాలి.

8వ నాచ్ లో ఉంటే టాప్ గేర్ అని అర్థం

8వ నాచ్ లో ఉంటే టాప్ గేర్ అని అర్థం

ఎనిమిదో నాచ్ లో ఉంటే రైలుబండి టాప్ గేర్ లో వెళుతోందని అర్థం. అలాగే రైలు వేగాన్ని తగ్గించుకునేందుకు ఒక్కో నాచ్ ని తగ్గించుకుంటూ రావాలి. అయితే ప్రతిసారీ నాచ్ ను మార్చాల్సిన అవసరం ఉండదు. రైలు ఒకసారి వేగాన్ని అందుకుందంటే దాన్ని అలాగే ఉంచొచ్చు. 8వ నాచ్ లో పట్టాలపై ప్రయాణించవచ్చు. అయితే విద్యుత్తుతో నడిచే రైళ్లలో మాన్యువల్ గా గేర్లు మార్చే అవకాశం ఉండదు. అది మొత్తం ఆటోమాటిక్ వ్యవస్థపై ఆధారపడివుంటుంది. వేగానికి అనుగుణంగా గేరు మారుతూ వెళుతుంది. వేగాన్ని పెంచడంకానీ, తగ్గించడంకానీ లోకో పైలట్ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉండదు.

రైలు వేగాన్ని పట్టాలు తట్టుకుంటాయా?

రైలు వేగాన్ని పట్టాలు తట్టుకుంటాయా?

రైలు.. వేగంగా వెళ్ళడానికి గేరు వ్యవస్థతోపాటు పవర్ సెక్షన్ పై ఆధారపడుతుంది. ట్రాక్ నాణ్యత, దాని సమర్థతను పవర్ సెక్షన్ తెలియజేస్తుంది. ఆ రైలు ఎంత వేగంతో వెళితే ట్రాక్ లు తట్టుకుంటాయి? వాటి గరిష్ఠ వేగం ఎంత? తదితర అంశాలపై అది ఆధారపడివుంటుంది. రైలు ఎంత వేగంతో వెళితే ట్రాక్ తట్టుకోగలదు? అనే విషయాన్ని ప్రధానంగా తెలుసుకోవాలి. అలాగే ఎక్కువ వేగంతో, ఎక్కువ బరువుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. అందుకే రైలును తయారు చేసిన సమయంలోనే ఎంత వేగంతో వెళితే పట్టాలు తట్టుకుంటున్నాయనే విషయం తెలుసుకోవడానికి ప్రయోగాత్మకంగా నడిపి చూస్తారు. ఎంత వేగంతో వెళితే పట్టాలు తట్టుకుంటున్నాయో తెలుసుకొని ఆ పద్ధతిని ఫాలో అవుతారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మన దేశంలో రోజుకు కొన్ని వేల కిలోమీటర్ల మేర రైళ్లు ప్రయాణం చేస్తున్నాయి. 68వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉండటంతోపాటు 13వేలకు పైగా సర్వీసులను రైల్వే నిర్వహిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+