జగన్‌కు ఐరన్ లెగ్: వెంకన్న, బాబూ! దమ్ముంటే నాపై గెలుపు, అందుకే గొడవ: నాని

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. గడ్డం, మీసాలు పెంచుకుంటే పెద్ద రౌడీ అనే రీతిలో అతను వ్యవహరిస్తున్నాడన్నారు. నాని ఒక సైకో, ఒక పిచ్చోడు, ఓ ఐరన్ లెగ్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గతంలో రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలిచారని, ఆ రెండు సార్లు టిడిపి అధికారంలోకి రాలేదన్నారు. ఇప్పుడు వైసిపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారని, ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాలేదన్నారు. ఐరన్ లెగ్ మహిమ వల్ల ఆ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుందని ఎద్దేవా చేశారు.

నాని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదని విమర్శించారు. ఎన్నడూ ఇంటి నుంచి బయటకు రాని ఓ వృద్ధురాలిని కొడాలి నాని రోడ్డు మీదకు రప్పించారన్నారు. నాని అరాచకాలకు ముగింపు పలుకుతామని హెచ్చరించారు. కొడాలి నాని ఎపిసోడ్‌తో గుడివాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసిపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.

Kodali Nani is Iron leg: Buddha Venkanna

చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

కొడాలి నాని చంద్రబాబుకు సోమవారం సవాల్ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే 2019 ఎన్నికల్లో గుడివాడలో తన పైన పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. నేను ఓడిపోతే రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని చెప్పారు. తన పైన గెలవకపోతే నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఇలాంటి చిల్లర పనులు చేయడం మానుకోవాలన్నారు.

వైసిపి కార్యాలయం ఉన్న భవనం గొడవపై మాట్లాడుతూ.. తాను త్వరలోనే ఖాళీ చేస్తానని చెప్పానని, శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గుడివాడలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బలవంతంగా ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.

చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. సిగ్గుమాలిన రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. చంద్రబాబు ఉడుత ఊపులకు నేను లేదా జగన్ భయపడే ప్రసక్తి లేదన్నారు. చట్ట ప్రకారం తనకు ఉన్న హక్కులతో త్వరలోనే అక్కడి నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తానని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ఫోటో, వైయస్ ఫోటో పక్క పక్కన పెట్టడం వల్లే వివాదం సృష్టిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+