జూనియర్ ఎన్టీఆర్‌తో లింక్: కొడాలి నానికి ఎదురుదెబ్బ?

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు కొడాలి నానికి నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణలతో గల సన్నిహత సంబంధమే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రతిబంధకంగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల విజయవాడలో కొడాలి నాని, హరికృష్ణ ఒకే కారులో ప్రయాణించారు. నందమూరి హరికృష్ణ పాల్గొన్న పశు వైద్యశాల ప్రారంభం కార్యక్రమంలో ఇతర తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి కొడాలి నాని హాజరయ్యారు. దీంతో కొడాలి నాని సైకిలెక్కడం ఖాయమనే ప్రచారం ముమ్మరంగా సాగింది.

ఆ వార్తలను అప్పట్లో కొడాలి నాని కూడా పెద్దగా ఖండించలేదు. దీంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే, కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని అంటున్నారు.

Kodali Nani may rejected by TDP die to the relationship with Jr NTR

జూనియర్ ఎన్టీఆర్‌కు, హరికృష్ణకు అత్యంత సన్నిహితుడు కావడం వల్లనే చంద్రబాబు కొడాలి నానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని అంటున్నారు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను, హరికృష్ణను దాదాపుగా పక్కన పెట్టేసినట్లే. పైగా, నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ పట్ల ఏ మాత్రం సుముఖంగా లేరని అంటున్నారు.

కొడాలి నాని రాజకీయాలతో తనకు సంబంధం లేదని గతంలో కొడాలి నాని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తాను చేరిన సమయంలో ఆ మాటన్నారు. ఇప్పుడు కొడాలి నాని టిడిపిలో చేరడానికి ప్రయత్నాలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+