వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Casino Row: చీకోటితో సంబంధాలు - టీడీపీకి కొడాలి నాని సవాల్..!!

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కేసినో వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంటోంది. కేసినో వ్యవహారంలో ఈడీ దాడుల ద్వారా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చీకోటి ప్రవీణ్..మాధవ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాల సమయంలో పలువురు సినీ సెలబ్రెటీలు..రాజకీయ నేతలతో సంబంధాలను గుర్తించారు. భారీ మొత్తం నగదు చెల్లింపులు..హవాలా ద్వారా జరిగినట్లు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు ఈ ప్రవీణ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 16 మంది ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే..సంక్రాంతి వేళ గుడివాడ కేసినో వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది.

కొడాలి నాని కౌంటర్

కొడాలి నాని కౌంటర్

దీని పైన టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి. గుడివాడలో సంక్రాంతి సందర్భంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అలాగే నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారని.. అందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నేతలకు దమ్ముంటే కేసినో వ్యవహారంలో ఈడీ దాడుల ద్వారా తనను అరెస్ట్‌ చేయించాలని సవాల్ చేసారు.

ఈడీకి టీడీపీ నివేదిక ఇవ్వాలి

ఈడీకి టీడీపీ నివేదిక ఇవ్వాలి

గుడివాడిలో జూదం అంటూ వచ్చిన టీడీపీ నిజ నిర్దారణ కమిటీ తమ నివేదికను ఈడీకి ఇవ్వాలని సూచించారు. దేశంలో ఏమి జరిగినా దానిని చంద్రబాబు భజన బృందం జగన్‌కు ముడిపెడుతోందని మండిపడ్డారు. అటు కేసినో వివాదంలో చీకోటి ప్రవీణ్ నివాసంలో సోదాల సమయంలో రాజకీయ ప్రముఖుల సంబంధాలు బయట పడ్డాయనే ప్రచారంతో ఎవరితో ఆ సంబంధాలు కొనసాగించారనే అంశం పైన ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో విచారణకు రావాలంటూ ప్రవీణ్.. మాధవరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది.

ప్రవీణ్ తో లింకులున్న నేతలెవరు

ప్రవీణ్ తో లింకులున్న నేతలెవరు

ప్రవీణ్ వినియోగించే లాప్ టాప్.. మొబైల్ ఫోన్లును ఈడీ స్వాధీనం చేసుకుంది. బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లకు కేసినో ప్రమోషన్ల కోసం పెద్ద మొత్తంలో నగదు ఇచ్చినట్లుగా గుర్తించారు. ప్రధానంగా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేది ఆరోపణ. విచారణ సమయంలో చీకోటి ప్రవీణ్ ఇచ్చే సమాచారం ఆధారంగా మరి కొంత మంది విచారణకు ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ ఉత్కంఠకు కారణమవుతోంది.

English summary
Ex minister Kodali Nani Reacted on TDP comments against his involvement in casino and links with Chikoti praveen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X