కొడాలి నాని ఎక్కడ - క్లారిటీ ఇచ్చిన పోలీసులు..!!
మాజీ మంత్రి కొడాలి నాని ఎక్కడ. వైసీపీ నేత కొడాలి నానిని కోల్ కతాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ కావటంతో కోల్ కతా విమానాశ్రయంలో కొడాలి నాని ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం సాగింది. వీటి పైన అటు పోలీసు వర్గాలు.. ఇటు కొడాలి నాని స్పష్టత ఇచ్చారు. దీంతో, కొడాలి నాని గురించి సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం పైన స్పష్టత వచ్చింది.
కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారన్న ప్రచారం వేళ... పోలీసు వర్గాలు స్పష్టత ఇచ్చాయి. కొడాలి నాని కోల్‌కతాలో అరెస్ట్ చేశామన్న ప్రచారంలో నిజం లేదని పోలీసు వర్గాలు తేల్చి చెప్పాయి. అదే విధంగా కొడాలి నాని పైన జరుగుతన్న ప్రచారం వేళ ఆయన సన్నిహితులు స్పందించారు. కొడాలి నాని హైదరాబాద్ లోనే ఉన్నారని..అసలు కొడాలి నానికి పాస్ పోర్టు కూడా లేదని చెప్పుకొచ్చారు. దీంతో, కొడాలి నాని పైన వస్తున్న ప్రచారం పై క్లారిటీ వచ్చింది. కాగా, పీ పోలీసులు కొడాలి నాని పైన పలు కేసులు నమోదు చేసారు. వైసీపీ హయాం లో కొడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత కొడాలి నాని పైన కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని న్యాయస్థానాలను ఆశ్రయించారు.

ఆ తరువాత అనారోగ్య సమస్యలతో కొడాలి నాని ఆస్పత్రిలో చేరారు. ముంబాయి లోని ఆస్పత్రిలో నానికి బైపాస్ సర్జరీ చేసారు. క్రమేణా కోలుకుంటున్న కొడాలి నాని కొద్ది రోజులు గా తిరిగి వ్యక్తిగత కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక వివాహ వేడుకలో నాని హాజరైన ఫొటో లు వైరల్ అయ్యాయి. అదే సమయం లో కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక.. ప్రస్తుతం ఆపరేషన్ తరువాత విశ్రాంతిలో ఉన్న నాని పైన జరుగుతున్న ప్రచారం పైన అధికారికంగా స్పష్టత వచ్చింది. నాని మరి కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచన చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications