తారక్ ఫోన్ చేసారు - ఎన్నికల్లో పోటీపై చెప్పారు: కొడాలి నాని..!!
నందమూరి తారకరత్నకు మాజీ మంత్రి కొడాలి నాని నివాళి అర్పించారు. హైదరాబాద్ లో తారకరత్న కుటుంబ సభ్యులను కొడాలి నాని పరామర్శించారు. అక్కడ విజయ సాయిరెడ్డి బెంగుళూరు ఆస్పత్రిలో తారకరత్నకు అందించిన వైద్యం..విషమించిన పరిస్థితులను వివరించారు. తారకరత్న మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని పేర్కొన్నారు. తనకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందిరతో మంచి సంబంధాలు ఉన్నాయని..అదే విధంగా తారకరత్నతోనూ రిలేషన్ ఉందని చెప్పుకొచ్చారు. సినిమాల్లో..రాజకీయంగానూ ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న తారక రత్న చిన్న తనంలో మరణించటం బాధాకరమన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసారు.
ప్రతీ ఒక్కరితో తారకరత్న కలివిడిగా ఉండే వారని కొడాలి నాని చెప్పారు. తారకరత్న తనను అన్న అని పిలిచేవారని..తాను తారక్ అని పిలిచే వాడినని వివరించారు. తనకు ఫోన్ చేసి పలు అంశాల పైన మాట్లాడారని పేర్కొన్నారు. తారక్ కు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని చెప్పారన్నారు. తండ్రి వైపు టీడీపీ..అత్త గారి వైపు వైసీపీ ఉన్నాయన్నారు. తాత పెట్టిన పార్టీ కావటంతో టీడీపీ నుంచి పోటీ చేయాలని బావించారని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వస్తానని తారక్ తనతో చెప్పారని కొడాలి నాని గుర్తు చేసుకున్నారు. తారకరత్న మరణం తనకు బాధ కలిగించిందని చెప్పారు. తారక్ పలు సినిమాల్లో హీరోగా.. విలన్ గా చేసారన్నారు. రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దం అవుతున్నారని కొడాలి నాని వివరించారు.

తారకరత్న భౌతిక కాయం హైదరాబాద్ కు తీసుకొచ్చిన సమయం నుంచి వైసీపీ నేత విజయ సాయిరెడ్డి అక్కడే ఉన్నారు. పరామర్శకు వచ్చిన వారితో మాట్లాడుతూ కనిపించారు. చంద్రబాబు, చిరంజీవి, బాలకృష్ణ తో చర్చించారు. తారకరత్న చికిత్స విషయంలో బాలకృష్ణ చూపించిన చొరవను ఇప్పటికే సాయిరెడ్డి అభినందించారు. ఇప్పుడు తారకరత్న నివాసంలో సాయిరెడ్డి- బాలకృష్ణ ఇద్దరూ తారకరత్నకు అందిన చికిత్స గురించి చర్చించుకున్నారు. చిరంజీవిక సైతం సాయిరెడ్డి బెంగుళూరులో అందించిన చికిత్స గురించి విశ్లేషించారు. ఉదయం తారకరత్నను చూడగానే విషాదంగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తో విజయ సాయిరెడ్డి మాట్లాడారు. తారకరత్న సతీమణి విజయసాయిరెడ్డి సతీమణి సోదరి కుమార్తె. దీంతో...సాయిరెడ్డి ఈ సమయంలో అక్కడ తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications