జగన్ సీటును టచ్ చేసే ధైర్యం ఎవరికి : పవన్ కమ్మవర్గం గురించా.. : రాజీనామా చేస్తా - కొడాలి నాని..!!
టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేనాని పవన్ కళ్యాణ్ పైన మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసారు. జంగారెడ్డి గూడెంలో సహజ మరణాలను కల్తీ సారాయి తాగి చనిపోయారంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు తన సతీమణి గురించి అవమాన కరంగా మాట్లాడారంటూ శపథం చేసి సభ నుంచి వెళ్లిపోయారని గుర్తు చేసారు. మరి..తన తల్లిని అవమానపరిస్తే.. లోకేష్ ఎలా సభకు వస్తున్నాడని మంత్రి ప్రశ్నించారు. జగన్ నాడు పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. సభను బహిష్కరించారని చెప్పారు.

నాడు జగన్ కు మద్దతుగా అందరం..
జగన్ కు మద్దతుగా నాడు వైసీపీ ఎమ్మెల్సీలు..ఎమ్మెల్యేలు సభలో కాలు పెట్టలేదు. నాయకుడి వెనుక నడిచామని చెప్పారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేసారు. ఆ కేసును గాలికి వదిలేసారని ఆరోపించారు. బీటెక్ రవి..ఆదినారాయణ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసారు. ఆ కేసును జగన్ కుటుంబ సభ్యుల మీదకు తోసారని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ లక్ష్యం జగన్ ను ఓడించటం.. చంద్రబాబును గెలిపించటమేనని చెప్పారు. జగన్ కు కమ్మ వర్గం వర్గ శత్రువు అని చెబుతున్నారని..అసలు ఇది తాము ఎప్పుడూ వినలేదన్నారు.

పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరితే సరి
జనసైనికులందరం కలిసి చంద్రబాబును పల్లకీలో మోసి..సీఎం ను చేసి..కమ్మ వర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత తమ మీద ఉందని పవన్ చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ను సీఎం చేయటం కోసం పవన్ కు పార్టీ దేనికని ప్రశ్నించారు. టీడీపీలోనే పవన్ చేరిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. వీళ్లు జగన్ ను ఏం చేయలేరని కొడాలి నాని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎవరైనా జగన్ ను ఢీ కొట్ట గలిగిన మగాడు ఉంటే..పార్టీ సింబల్ మీద 160 సీట్లలో పోటీ చేస్తే తాను రాజకీయాలను వదిలేసి వెళ్లిపోతానని కొడాలి నాని సవాల్ చేసారు.
Recommended Video

జగన్ సీటును టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు
అన్ని పార్టీలు కలిసి పంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని ఫైర్ అయ్యారు. అసలు 160 సీట్లకు పోటీ చేసే ధైర్యం ఉందా అని నిలదీసారు. అందరూ కలిసి 175 సీట్లలో పోటీ చేస్తారని..ఒక్కో పార్టీ పంచుకోవాలని చెప్పారు. 175 సీట్లకు పోటీ చేసే ధైర్యం జగన్ కు మాత్రమే ఉందన్నారు. 150 సీట్లకు పైగా గెలిచే మగాడు జగన్ ఓక్కరేనని కొడాలి నాని చెప్పుకొచ్చారు. జగన్ ఉండగా..ఆయన సీఎం సీటును ఏ ఒక్కరూ టచ్ చేయలేదరంటూ కొడాలి నాని ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications