కేసీఆర్‌కు షాక్: ఆర్టీసీ సమ్మెకు కోదండ సపోర్ట్, హరీష్‌ను చిక్కుల్లో పడేశారు
హైదరాబాద్: తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికారు. సమ్మెకు మద్దతుగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ కార్మికులతో కలిసి కోదండరామ్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలకడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తమ సమ్మెకు మద్దతు పలుకుతున్నారని ఆర్టీసీ యూనియన్ శనివారం ప్రకటించి.. ఆయనను చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే. తమ సమ్మెకు ఆయన మద్దతు ఉందని టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి ప్రకటించడం కలకలం రేపింది. మరోవైపు సమ్మెలో కోదండరాం పాల్గొనడం గమనార్హం.
ఇదిలా ఉండగా, ఆర్టీసీ తెలంగాణ మజ్దర్ యూనియన్ నేత అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యల పైన మాట్లాడేందుకు హరీష్ రావు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ఆ వ్యాఖ్యలు తనకు తెలియదని చెప్పారని సమాచారం. ఓ మంత్రిగా తనకు కామెంట్స్ చేసేందుకు తనకు కొన్ని పరిధులు ఉంటాయని చెప్పారని తెలుస్తోంది.

హరీష్ రావు
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మద్దతు ఉందని టీఎంయూ నేత అశ్వత్ధామరెడ్డి అన్నారు. సీఎం వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆయన శనివారంనాడు విమర్శించారు.

కోదండరామ్
తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ శనివారం నాడు జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆర్టీసీ సమ్మెలో మాట్లాడుతున్న దృశ్యం.

ఆర్టీసీ సమ్మె
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ వద్దే వంట చేసుకుంటున్నారు.

ఆర్టీసీ సమ్మె
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు బస్టాండ్ వద్దే వంట చేసుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications