వెనక్కి తగ్గం: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై కోదండరామ్

పోలవరం అంశం అనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదం కాదని, ఆదివాసుల హక్కులపై జరుగుతున్న దాడిగా తాము భావిస్తున్నామని అన్నారు. పోలవరంపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
లోక్‌సభలో ఆమోదం పొందినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని న్యాయపోరాటం చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. పోలవరం బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని నిరసిస్తూ చేపట్టిన బంద్‌లో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
తెలంగాణ జెఎసి, సిపిఎం, సిపిఐ, న్యూడెమోక్రసీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను సీపీఎం నేతలు దహనం చేశారు. తెలంగాణవ్యాప్తంగా బంద్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications