టిడిపి కాంగ్రెసు అవుతుంది: బాబుకు కోడెల హెచ్చరిక

కాంగ్రెసు పార్టీలోని నాయకులును తమ పార్టీలో చేర్చుకుంటే తెలుగుదేశం పార్టీ మరో కాంగ్రెసు పార్టీ అవుతుందని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు. చూడబోతే తెలుగుదేశం పార్టీలో కాంగ్రెసు విలీనమవుతున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుపై పోరాటంలో అనేక మంది టిడిపి నేతలు ప్రాణాలు కోల్పోయారని, అందువల్ల టిడిపి శ్రేణులకు ఇబ్బంది లేకుండా చేరికలు ఉండాలని ఆయన అన్నారు. ఈ విషయంలో ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పరోక్షంగా హెచ్చరికలు చేశారు.
కాంగ్రెసు దుష్టపాలనపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోరాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తుది వరకు పోరాటం చేశామని చెప్పారు. విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో నాయకులు, ప్రజలు కాంగ్రెసుపై వ్యతిరేకతతో ఉన్నారని, ఈ స్థితిలో కాంగ్రెసు తరఫున రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. దాంతో కాంగ్రెసు నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పారు. మరికొంత మంది తమ పార్టీ కండువా వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications