లోక్‌స‌భ బ‌రిలోకి కోడెల : త‌న‌యుడికి అసెంబ్లీ సీటు : కోడెల పై వైసిపి నుండి ఆయ‌నేనా..!

ఏపి శాస‌న‌స‌భా స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్ లోక్‌స‌భ బ‌రిలోకి దిగటం దాదాపు ఖాయ‌మైంది. ఆయ‌న ప్ర‌స్తుతం గుంటూ రు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక‌, ఆయ‌న త‌న‌యుడు శివ‌రాం ను న‌ర్స‌రావు పేట ఎమ్మెల్యేగా బ‌రిలోకి దింపాల‌ని టిడిపి అధినేత నిర్ణ‌యించారు.

ఎంపి అభ్య‌ర్దిగా కోడెల‌..

ఎంపి అభ్య‌ర్దిగా కోడెల‌..

స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద రావు రానున్న ఎన్నిక‌ల్లో న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ నుండి వైసిపి నేత అంబ‌టి రాంబాబు మీద గెలుపొందారు. స‌త్తెన‌ప‌ల్లి లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. అయితే, ప‌ల్నాడు ప్రాంతంలో ప‌ట్టు ఉన్న కోడెల ను న‌ర్స‌రావు పేట ఎంపీగా బ‌రిలోకి దించ‌టం ద్వారా మేలు జ‌రుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నారు. దీంతో..ఆయ‌న ఎంపీగా బ‌రిలోకి దిగ నున్నారు. అయితే, త‌న కుటుంబానికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాల‌ని కోడెల ప్ర‌తిపాదించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందు లో భాగంతా న‌ర్స‌రావు పేట ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు సీయం అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం న‌ర్స‌రావు పేట ఎంపీగా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టానికి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌టం లేదు.

రాయ‌పాటి..కోడెల త‌న‌యుళ్ల‌కు అసెంబ్లీ సీట్లు..

రాయ‌పాటి..కోడెల త‌న‌యుళ్ల‌కు అసెంబ్లీ సీట్లు..

ఎంపీగా కోడెల శివ ప్ర‌సాద్ బ‌రిలోకి దిగితే..న‌ర్స‌రావుపేట ఎమ్మెల్యేగా ఆయ‌న త‌న‌యుడు కోడెల శివ‌రాం కు టిక్కెట్ ఖ‌రారు కానుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి నుండి హామీ ల‌భించిన‌ట్లు స‌మాచారం. ఇక ఈ ఎన్నిక‌ల్లో పోటీ నుండి దాదాపు దూర‌మ‌వుతున్న రాయ‌పాటి త‌న‌యుడికి సైతం అసెంబ్లీ సీటు ఇవ్వ‌టానికి ముక్య‌మంత్రి అంగీక‌రిం చారు. అందులో భాగంగా..ఇప్ప‌టి వ‌ర‌కు కోడెల ప్రాతినిధ్యం వ‌హించిన స‌త్తెన‌ప‌ల్లి సీటును రాయ‌పాటి కుమారుడైన రాయ‌పాటి రంగారావుకు ఇచ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది.

కోడెల పై మోదుగుల పోటీ..!

కోడెల పై మోదుగుల పోటీ..!

ఇక‌, న‌ర్స‌రావు పేట ఎంపీగా బ‌రిలోకి దిగటం ఖాయ‌మైన ప‌రిస్థితుల్లో ఆయ‌న పై టిడిపి ప్ర‌స్తుత ఎమ్మెల్యే మోదుగుల వేణు గోపాల‌రెడ్డి వైసిపి నుండి పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. మోదుగుల ప్ర‌స్తుతం గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న వైసిపి లో చేర‌టం ఖాయ‌మైంది. ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లి సీటు ఆశిస్తున్న‌ప్ప‌టికీ..వైసిపి అధినేత జ‌గ‌న్ మాత్రం మోదుగుల ను న‌ర్స‌రావుపేట ఎంపీగా పోటీకి సిద్దం కావాల‌ని సూచింన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. 2009 ఎన్నిక‌ల్లో మోదుగుల నర్స‌రావుపేట ఎంపీగా నాటి కాంగ్రెస్ అభ్య‌ర్ది బాల‌శౌరి పై విజయం సాధించారుద‌. దీంతో.. ఇప్పుడు న‌ర్స‌రావు పేట లోక్‌స‌భ బ‌రిలో కోడెల వ‌ర్సెస్ మోదుగుల గా పోరు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+