వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఎన్నికల్లో పోటీచేయడంలేదు.. YCP MLA కీలక ప్రకటన!

ఎమ్మెల్యే సుధాకర్‌పై మాజీ మండలాధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్ నాయుడు మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

APలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. మరోవైపు పార్టీలోని నేతల మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నాయి. వర్గపోరు తీవ్రంగా ఉండటంతో రాబోయే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోబోతున్నారు.

తాజాగా ఆ జాబితాలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ చేరారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయడంలేదంటూ ప్రకటించారు. కర్నూలు రూరల్ మండలంలోని ఉల్బాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీచేయడంలేదంటూ ప్రకటన చేశారు. సుధాకర్‌పై మాజీ మండలాధ్యక్షుడు బుర్ర పెద్ద వెంకటేశ్ నాయుడు మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలను ఎమ్మెల్యే పక్కనపెట్టారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన రౌడీమూకలను అందలం ఎక్కించారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సుధాకర్ కు టికెట్ రావడానికి కష్టపడినవారిని మరిచిపోయారని, సుధాకర్ నమ్మకద్రోహి అంటూ నిప్పులు చెరిగారు.

kodumuru ycp mla sudhakar will not contest next assembly elections

ఇంత నమ్మకద్రోహిని తాను ఎక్కడా చూడలేదని, అన్యాయం చేసినందుకు సుధాకర్ మూల్యం చెల్లించుకుంటారని బుర్ర వెంకటేశ్ నాయుడు హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సుధాకర్ ప్రకటించడంతో స్దానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఎమ్మెల్యే ప్రకటన చేయడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సుధాకర్ తప్పుకున్నట్లు ప్రకటించడంతో.. కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ టికెట్ కోసం ఇప్పటికే పలువురు నాయకులు పోటీపడుతున్నారు.

English summary
Although there is still time for assembly elections in AP, key developments are already taking place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X