జగన్‌కు భారీ షాక్: బొత్స అల్లుడి హవా, కోలగట్ల రాజీనామా, వైసిపి డోంట్ కేర్!
వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లాలో గట్టి షాక్ తగిలింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ కోలగట్ల విరభద్ర స్వామి బుధవారం నాడు రాజీనామా చేశారు.
విజయనగరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లాలో గట్టి షాక్ తగిలింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ కోలగట్ల విరభద్ర స్వామి బుధవారం నాడు రాజీనామా చేశారు.
ఆ వెంటనే తన అనుచరులతో రహస్యంగా భేటీ అయ్యారు. జిల్లాలో కోలగట్లను లెక్క చేయకుండా అంతా తామే అన్న భావంతో బొత్స సత్యనారాయణ వర్గం వ్యవహరిస్తోందని, ఈ కారణంగానే ఆయన రాజీనామా చేసారని అంటున్నారు.
కోలగట్ల వర్గానికి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం, జిల్లా అధ్యక్షుడిగా తాను చేయాల్సిన పనులు కూడా బొత్స సత్యనారాయణ మేనల్లుడు అంతా తానై వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
బొత్స అల్లుడు జిల్లాలో చక్రం తిప్పుతుండటంతో, తనకు ప్రాధాన్యత లేకపోవడంతో కోలగట్ల రాజీనామా చేశారని అంటున్నారు. కోలగట్ల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చినా అధినాయకత్వం పట్టించుకోలేదని అంటున్నారు. చివరకు ఆయన ఈ రోజు రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications