మాజీల గ్యాంగ్ వార్: కొనాపురి శంకర్‌పై కాల్పులు

 Konapuri Shankar injured in firing
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మాజీ నక్సలైట్ల మధ్య గ్యాంగ్ వార్ మరోసారి సంచలనం సృష్టించింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో మాజీ మావోయిస్టు కొనాపూరి శంకర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం సాయంత్రం కాల్పులు జరిపారు.

కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శంకర్‌ను హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శంకర్ బైక్‌పై వెళ్తుండగా ప్రదీప్ రెడ్డి కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. కోనాపూరి శంకర్ నయీం గ్యాంగ్‌కు సన్నిహితుడనే భావన ఉంది.

గతంలో నయీం గ్యాంగ్ కాల్పుల్లోనే మాజీ నక్సలైట్ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కోనాపురి రాములు మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొనాపూరి రాములులకు ప్రధాన అనుచరుడిగా పేరున్న ప్రదీప్ రెడ్డి ఈ కాల్పులకు పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.

లొంగిపోయిన ప్రదీప్

కొనాపూరి శంకర్‌పై కాల్పులు జరిపాడని భావిస్తున్న కొమరెల్లి ప్రదీప్ నల్లగొండ జిల్లా భువనగిరి డిఎస్పీ కార్యాలయంలో లొంగిపోయాడు. నయీం ముఠా సానుభూతిపరుడిగా ఉన్న ప్రదీప్ శంకర్‌పై కాల్పులు జరిపాడని అనుమానిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లీకూతుళ్లు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని వేల్పూరు మండలం పడకల్ శివారులో నవాబు చెరువులో పడి ఓ తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+