చంద్రబాబు వరమిచ్చినా కొణతాల, ఆదిలకు తప్పని తిప్పలు

విజయవాడ: పార్టీ కేంద్ర కమిటీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పచ్చ జెండా ఊపినా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణకు, ఆదినారాయణ రెడ్డికి అడ్డంకులు తప్పడం లేదు. జిల్లా రాజకీయాలు వారికి ఆటంకంగా మారాయి. కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి టిడిపిలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాను టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు చేరాలనేది టిడిపి నేతలే చెప్పాలని ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అయితే, జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జీ రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవాలనే చంద్రబాబు ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, ఆదినారాయణ రెడ్డిపై శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలు ఒకే పార్టీలో ఒదడం కష్టమైన పనే. కానీ, వారిద్దరికి సయోధ్య కుదిర్చి ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలనేది చంద్రబాబు ఆలోచన. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఆదినారాయణ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా జగన్ సొంత జిల్లాలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని బలహీనపరచవచ్చుననేది చంద్రబాబు ఆలోచన.

Konathala and adinarayana Reddy facing hurdles to join in TDP

కాగా, విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు కొణతాల రామకృష్ణ ఎంట్రీపై ప్రభావం చూపుతున్నాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన మంత్రులు అయ్యనపాత్రుడికి, గంటా శ్రీనివాస రావుకు మధ్య విభేదాలు ఉన్నాయి. కొణతాల రామకృష్ణను పార్టీలోకి తీసుకోవడం ద్వారా గంటా శ్రీనివాస రావును బలహీనపరచాలనేది అయ్యన్న పాత్రుడి ఆలోచనగా చెబుతారు.

అయితే, కొణతాల రామకృష్ణను పార్టీలోకి చేర్చుకోవాలనే ఆలోచనను గంటా శ్రీనివాస రావు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. కొణతాలను పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనకు వ్యతిరేకత రావడం సహజమేనని గంటా శ్రీనివాస రావు అన్నారు. కొణతాల రామకృష్ణ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా కలిశారు. చంద్రబాబు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినా, పార్టీలోని విభేదాల కారణంగా ఆయన రాకకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

పరిస్థితి గమనించిన రామకృష్ణ ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని ఈ నెలాఖరులో చెబుతానని కొణతాల రామకృష్ణ చెప్పారు. టిడిపిలోకి ఆయన రాక డోలాయమానంలోనే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అయితే, చంద్రబాబు మాత్రం 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల్లోని బలమైన నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మాత్రం సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+