మళ్లీ జగన్ పార్టీ గూటికి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ?

విశాఖపట్నం: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తిరిగి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గూటికి చేరుకునే అవకాశం ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన ఈ మేరకు ప్రకటన చేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. గతంలో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చారు. తెలుగుదేశ పార్టీలో, బిజెపిలో చేరుతారంటూ ప్రచారం సాగింది. అయితే, ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ చేరలేదు. తిరిగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

టిడిపిలో రేపో మాపో చేరుతారంటూ గతంలో వార్తలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా ఉన్న కొణతాల రామకృష్ణను పార్టీ నుంచి తొలగిస్తూ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరుడు అక్టోబర్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అప్పట్లో వెల్లడించారు.

Konathala ramakrishna may re enter into YSR Congress

కొణతాల ప్రధాన అనుచరుడైన గండి బాబ్జీ కూడా పార్టీకి దూరమయ్యారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జగన్ వచ్చినప్పుడు పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జిగా ఉండి కూడా గండి బాబ్జీ హాజరు కాలేదు. సహాయక చర్యల్లో కూడా పాల్గొనలేదు. దీంతో బాబ్జీని నియోజకవర్గ ఇంచార్జిగా తొలగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

బాబ్జీని ఇంచార్జిగా తొలగించడాన్ని సహించలేని కొణతాల అప్పట్లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను జగన్‌కు మెయిల్ ద్వారా పంపించారు. తను పార్టీలో ఉండడం ఇష్టం లేదనుకుంటే, దానికి కూడా రాజీనామా చేస్తానని కొణతాల అదే లేఖలో చెప్పారు. అప్పటి నుంచి కొణతాల రామకృష్ణ అన్ని పార్టీలకూ దూరంగానే ఉంటూ వస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+