వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారి సంగతేంటి?: కోదండరాంపై కొండా సురేఖ సీరియస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konda Surekha questions Kodandaram
వరంగల్/హైదరాబాద్: తమను తెలంగాణ ద్రోహులన్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ పైన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి నేత కొండా సురేఖ మంగళవారం మండిపడ్డారు. తమను తెలంగాణ ద్రోహులు అంటున్న జెఏసి అమరవీరుల కుటుంబాలను ఎందుకు ఆదుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణపై యూ టర్న్ తీసుకున్నందునే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పానని గుర్తు చేశారు.

తమను ఉద్యమ ద్రోహులు అంటున్న కోదండరామ్‌కు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ద్రోహులుగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పన్నెండు వందల మంది యువకులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెసు పార్టీ పైన ఏం సమాధానం చెబుతారన్నారు. నీటిని ఆంధ్రాకు తరలించిన ద్రోహి తెలంగాణ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఉద్యమాన్ని, ఉద్యమకారులను అణగదొక్కిన పొన్నాల తెలంగాణ ద్రోహి కాదా అన్నారు.

తెలంగాణ కోసం రాజీనామా చేయాలని జెఏసి ఆదేశిస్తే తాను రాజీనామా చేశానని చెప్పారు. కాంగ్రెసు నేతలు రాజీనామా చేయలేదన్నారు. వారు ఉద్యమ ద్రోహులు కాదా అన్నారు. 1200 మంది విద్యార్థుల ఆత్మాహుతిలో కాంగ్రెసు పార్టీ పాత్ర లేదా అన్నారు. కాగా, తెరాసలో కొండా సురేఖ, మహేందర్ రెడ్డి తదితరుల చేరికను కోదండరామ్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.

నాయకులు వెళ్లినా: ఆనం

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ నుండి నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలు వెంటే ఉన్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హైదరాబాదులో చెప్పారు. టిక్కెట్ల కోసం పార్టీలో పోటీ నెలకొందన్నారు. మాజీ మంత్రులు లోకసభకు పోటీ చేయాలనుకుంటే దానిని అధిష్టాం పరిశీలిస్తుందన్నారు.

English summary

 Former Minister Konda Surekha on Tuesday has questioned TJAC chairman Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X