విజయమ్మా..మేం పిచ్చోళ్లమా : షర్మిలకు ఇగో - జగన్ తీరు ఇలా : కొండా సురేఖ సంచలనం..!!
వన్స్ అపాన్ ఏ టైం. జగన్-వైఎస్- విజయమ్మ-షర్మిల ఎవరి మీద ఈగ వాలినా కొండా సురేఖ వారికి రక్షణ కవచంగా నిలిచారు. జగన్ ముఖ్యమంత్రి కాకపోవటంతో తాను మంత్రి కొనసాలేనని చెబుతూ రోశయ్య మంత్రివర్గం నుంచి మంత్రి పదవికి రాజీనామా చేసారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచారు. వైఎస్సార్ ఫ్యామిలీ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. చివరకు అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయా..ఎమ్మెల్యే పదవికి దూరమయ్యారు. షర్మిలతో కలిసి పాదయాత్రలోనూ పాల్గొన్నారు. అసెంబ్లీలో విజయమ్మకు అండగా నిలిచారు.

హార్డ్ కోర్ జగన్ విధేయురాలిగా...
జగన్ ను తెలంగాణ వాదులు తమ గడ్డ మీదకు రావటానికి వీళ్లేదంటే...మానుకోట లో జగన్ కు మద్దతుగా నిలిచారు. ఆ తరువాత తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. తరువాతి కాలంగా జగన్ సమైక్యాంధ్ర నినాదంతో సురేఖ ఆ కుటుంబానికి దూరమయ్యారు. ఇక, ఇప్పుడు అదే సురేఖ... వరుసగా షర్మిల-జగన్ - చివరకు విజయమ్మ పైనా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల తీరు పైన మండిపడ్డారు.

షర్మిలకు ఇగో - షార్ట్ టెంపర్...
షర్మిలకు ఈగో ఎక్కువంటూ కామెంట్ చేసారు. అసలు..ఆమె పార్టీలో చేరే ఆలోచన తనకు లేదంటూ తేల్చి చెప్పారు. జగన్ జైలుకు వెళ్లిన తరువాత షర్మిల పాదయాత్ర చేసే సమయంలో తాను ఆమె బాడీ లాంగ్వేజ్ చూసానని చెప్పుకొచ్చారు. షర్మిలకు షార్ట్ టెంపర్ ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రాణించాలని అనుకొనే వారికి అసలు అది పనికి రాదని సురేఖ వివరించారు. రాజకీయాల్లో ఉండాలంటే సాఫ్ట్ గా, ప్రజలతో ఫ్రెండ్లీ గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రజలతో కలిసి పోయి..వారితో సాధారణంగా ఉండాలని.. ఎక్కవగా అంచనా వేసుకుంటూ... హైఫైలో వెళ్తామంటే మనుగడ కష్టమని వ్యాఖ్యానించారు.

బాగా డబ్బులు ఉన్నాయి...అనిల్ తేగలరు..
షర్మిల ఇప్పుడు చేస్తోందంతూ డ్రాయా-యాక్టింగ్ గా అభివర్ణించారు. పేయిడ్ ఆర్టిస్ట్ మాదిరిగా వాళ్లదంతా జరుగుతోందని సీరియస్ వ్యాఖ్యలు చేసారు. వాళ్ల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటూ కామెంట్ చేసారు. బ్రదర్ అనిల్ ప్రపంచ వ్యాప్తంగా పైసలు తేగలడంటూ సురేఖ చెప్పుకొచ్చారు. అన్న అక్కడ ఒక తీరు మాట్లాడి ఇక్కడ చెల్లి ఒక తీరు మాట్లాడుతున్నారని..షర్మిళ అధికారం కోసం -స్వార్దం కోసం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు.

అక్కడ అన్న- ఇక్కడ షర్మిల ఇద్దరూ కలిసి..
ఇద్దరూ కలిసి నువ్వు అక్కడ-నేను ఇక్కడ అన్న విధంగా తెలంగాణను ముంచి ఆంధ్రాను బాగుచేసుకుందామనే ప్లాన్ వచ్చారా లేదా తెలియదంటూ సురేఖ వివరించారు. గతంలోనూ షర్మిల పార్టీ నుంచి కొండా సురేఖకు ఆహ్వానం వచ్చిందనే ప్రచారం సాగింది. ఆ సమయంలో సురేఖ తనకు ఆహ్వానం వచ్చినా తాను ఆ పార్టీలో వెళ్లనని స్పష్టం చేసారు. ఇక, రేవంత్ రెడ్డ టీపీసీ చీఫ్ అయిన తరువాత సురేఖ స్వయంగా వెళ్లి రేవంత్ ను కలిసారు. తాను కొత్తగా ఏ పార్టీలో చేరే అవకాశం లేదని స్పష్టం చేసారు.

విజయమ్మ..మేం పిచ్చోళ్లనుకుంటోందా..
అయితే, వీరిద్దరితో ఆగలేదు. తాను, అంతగా గౌరవించిన విజయమ్మ పైన సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తల్లి విజయమ్మ ఈ స్టేజ్ మీదకు వచ్చి నా బిడ్డకు మీకు అప్పగిస్తున్నా అంటున్నారు. ఆ స్టేజీ మీదకు వెళ్లి నా బిడ్డను మీకు అప్పగిస్తున్నా అంటున్నది, అసలు పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్లనుకుంటోందా అంటే ఘాటుగా సురేఖ ప్రశ్నించటం సంచనలంగా మారింది. వైఎస్సార్ కుటుంబానికి అంత విధేయురాలిగా పని చేసిన కొండా సురేఖ రాష్ట్ర విభజన - తెలంగాణ అంశాల కారణంగా ఆ కుటుంబంతో దూరమయ్యారు.

నాడు జగన్ పైనా విమర్శలు...కానీ..
కానీ, అప్పట్లో జగన్ పైన కొన్ని కీలక విమర్శలు చేసారు. కానీ, విజయమ్మ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు ఏకంగా విజయమ్మ పైన తీవ్ర వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో కొండా సురేఖ వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా నిలవటంతో..ఆ సమయంలో ఆంధ్రాలో సైతం వైఎస్సార్ అభిమానులు సురేఖను పెద్ద ఎత్తున అభిమానించే వారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో సురేఖ ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేసారు.

టార్గెట్ షర్మిల- రియాక్షన్ ఉంటుందా..
ఇప్పుడు జగన్ అధికారంలోకి రావటం...అన్నతో విభేదించి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేయటం తో కొంత కాలంగా అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతోందనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. తెలంగాణ లో నాడు వైఎస్సార్ కు విధేయులుగా పని చేసిన పలువురు నేతలు షర్మిలకు మద్దతుగా నిలుస్తారనే ప్రచారమూ సాగింది. అయితే, ఇప్పుడు వారితో అంత సన్నిహితంగా మెలిగిన కొండా సురేఖ లాంటి వారు ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యల పైన విజయమ్మ-షర్మిల మద్దతు దారులు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications