టీ పట్ల బీజేపీకి వివక్ష లేదు: కేసీఆర్‌కు సొంత ఎంపీ షాక్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం వివక్ష చూపడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పుడు మాటలు కేంద్రంలో నమ్మేవారని, తెరాస ఎంపీలు వాస్తవాలు వివరించిన తర్వాత తమనే నమ్ముతున్నారన్నారు.
పార్లమెంట్‌లోనూ మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టిన విషయమై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వాస్తవాలు వెల్లడించామన్నారు. దీంతో టీఆర్‌ఎస్ ఎంపీలతో సమావేశానికి అంగీకరించారన్నారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలలో ఎయిమ్స్ ఏర్పాటు చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసి తెలంగాణను విస్మరించారని పార్లమెంట్‌లో ప్రస్తావించగా.. తెలంగాణాకు ఎయిమ్స్ మంజూరైందన్నారు.

తెలంగాణపై బీజేపీ సానుకూలంగానే ఉందన్నారు. తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలకు ఎయిమ్స్ మంజూరు చేయడమేమిటని ప్రశ్నించగానే.. రెండు వారాల్లో రాష్ట్రానికి రూ.1,200 కోట్లతో ఎయిమ్స్ మంజూరయిందని చెప్పారు. ఈ మేరకు కేంద్రం నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు లేఖ వచ్చిందన్నారు.
వచ్చే బడ్జెట్‌లో మంజూరు అవుతాయన్నారు. తన నియోజకవర్గ పరిధిలో దీనిని నెలకొల్పేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారన్నారు. గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారాలు కట్టబెట్టే విషయమై ఈ నెల 18 తర్వాత కేంద్ర హోంమంత్రిని కలిసి వివరిస్తామన్నారు. తెలంగాణ నుండి కొత్తగా ఎన్నికైన వారికి మాట్లాడే అవకాశం ఇస్తున్నారని, ఉమాభారతి, స్మృతి ఇరానీ వంటి వారు బాగా సహకరిస్తున్నారని చెప్పారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications