హుస్సేన్ సాగర్ లాగా కొండవీటి వాగు అభివృద్ధి: నారాయణ
విజయవాడ/ న్యూడిల్లీ: హైదరాబాదులోని హుస్సేన్‌సారగ్‌ని తలపించేలా కొండవీటి వాగుని అభివృద్ధి పరుస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం రాజధాని నిర్మాణ అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు.2
9 గ్రామాల పరిధిలోనే రాజధాని నిర్మాణముంటుందన్నారు. అనుభవమున్న కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి 5, 10 వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. నెలాఖరులోగా రైతులకు కౌలు చెక్కులు అందిస్తామన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం వచ్చే గురువారం సింగపూర్‌లో పర్యటిస్తుందని నారాయణ చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో జపాన్‌కు చెందిన ఎకోమా అర్బన్ స్మార్ట్ సొల్యూషన్స్ కంపెనీ ప్రతినిధలు భేటీ అయ్యారని, కాకినాడను స్మార్ట్ సిటీగా మార్చేందుకు ఆ సంస్థ సుముఖంగా ఉందని చెప్పారు. ఈమేరకు త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు
ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. ఈ అంశమై బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. నిపుణుల పరిశీలన ప్రకారం ఈ ఏడాది 83 శాతం వరకు వర్షపాతం నమోదు కావచ్చని తెలిపారు. వర్షాభావ ప్రభావం ఉంటుంది కానీ అది దేశంలో ఏ ప్రాంతంలో ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం కూడా ఉంటుందని కేంద్ర వాతావరణ పరిశోధకులు చెబుతున్నారని మంత్రి చెప్పారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications